వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ గొంతెత్తి నినదాలిస్తుంటారు. కానీ ఈ నినాదంలోని మోరియా అనే పదానికి అర్ధం ఎంత మందికి తెలుసు. అసలు మోహియా అనే పదం ఎందుకు వాడుతున్నారు. అసలు వినాయక నిమజ్జనం అప్పుడే ఈ మోరియా అని ఎందుకు నినాదాలిస్తారు, మోరియా అనే పదం వెనక ఉన్న అసలు కథ ఏమిటో మీకు ఎప్పుడైనా, తెలుసుకోవాలని అనిపించిందా? లేదంటే ఇప్పుడు తెలుసుకోండి…
-మోరియా వెనుక ఉన్న అసలు కథ:
మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు నివసించేవాడు. గణపతికి పరమ భక్తుడైన మొరియా గోసాని, గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఒక రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించాడు.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో అని, వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.
ఆ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలందరూ, మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడని, మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. ఆ వార్త ఆ గ్రామం వరకే కాకుండా చుట్టుప్రక్కల వరకు పాకింది. వినాయకుడిని కలలో చూసిన మోరియా గోసావి, భక్తాగ్రేసరుడి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తి అని, తమకు దైవ స్వరూపుడంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు.
మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు భక్తులు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా అంటూ మరాఠీ లో నినదిస్తారు. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.





