తెలుగు జాతి సాహిత్య చరిత్రలో సమున్నత స్థానము కల్గిన పండితులనే కాక పామరులను సైతం ఆకట్టుకొని బహుళ ప్రచారం పొందిన ఎన్నో మంచి పుస్తకాలు రామరాను మరుగున పడిపోతున్నాయి. పాశ్చాత్యుల మోజులో పెరుగుతున్న కాన్వెంటు చదువుల పోటీలో తెలుగు వారికే స్వంతమైన ఎన్నో మంచి పుస్తకాలు రాబోయే తరం వారికి వాటిపై కనీస సమాచారం కూడా తెలియక పోయే ప్రమాదం ముంచుకొచ్చింది.
సిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలను పోల్చుకుంటూ వ్రాసిన పుస్తకాలు పండితులకే కాక పామరులకు కూడా చదివినంతనే సునాయసంగా అర్థమయ్యే రీతిలో వ్రాసిన పుస్తకాలు నేటిc బ్రిటిష్ విద్యావిధానంలో ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. ఉదాహరణకు పామరుడైనా తెలుగువాడి నోటిలో నానే వేమన శతకం, సుమతీ శతకం, దాశరదీ శతకం లాంటి పుస్తకాలు రోజు రోజుకు వేది విద్యా వ్యవస్థలో నామమాత్రంగా కూడా చోటు చేసుకోలేక పోతున్నాయి.
చదువు (విద్య) మనిషి వ్యక్తిత్వాన్ని పెంచడానికి ఉపయోగ పడ్తుందనుకొంటే, ఆ వ్యక్తిత్వం పెంచడానికి పామరుడికి సైతం సులువుగా అర్థమయ్యేటట్లు వ్రాసిన ఎన్నో నీతి శతకాలు మరుగైపోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. నాడు విద్యార్థిదశ పెద్దబాలశిక్షతో ఆరంభమయ్యేది. పెద్దబాలశిక్షలో ఓనమాల నుండి మనిషి పరిసరాల విజ్ఞానమే కాకుండా మెదడుక: మేత లాంటి విద్యార్థి ఆలోచనా సరళిని, పెంచే ఎన్నో ప్రక్రియలు, సామెతలు పేర్కొనబడ్డాయి. ‘పెద్దబాలశిక్ష చదివిన గ్రామీణుడి ముందు నేటి విశ్వవిద్యాలయాలలో పెద్ద చదువులు చదివి ‘పట్టాలు పుచ్చుకొన్నవారు సైతం నోరు మెదపలేని స్థితిలో ఉంటున్నారంటే అతిశయోక్తే కాదు.
తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానం కలిగిన అమర కోశము, భాస్కర శతకము, నీతి చంద్రిక, పంచతంత్రము, భర్చు వారి సుభాషితములు, కుమార శతకములలోని పద్యాలు గ్రామీణ ప్రాంతాలలోని రైతులను కదిలించిన ఆర్థ తాత్పర్యములతో సహా కంఠోపాఠంగా నల్లిస్తారు. కాని నేటి తరంలోని విద్యార్థులకు కనీసం వాటిపేరు, వాటిని వ్రాసిన రచయితల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
మానవ నిత్య జీవితానికి సంబంధించిన ఎన్నో కథలతో విద్యార్థులను ఆకర్షించటమే కాక పెద్దలనూ ఆలోచింప చేసేటట్లు చిన్నయసూరి వ్రాసిన పంచతంత్రములుగా పేరొందిన మిత్ర లాభము, మిత్ర భేదము, నీతి చంద్రిక, సంధి, విగ్రహములు నేటి విద్యాబోధనలు ১৪ మూలన చేర్చబడటం విచారించదగ్గ విషయం.
మానవ జీవితములో డబ్బుకు ప్రాధాన్యతను వివరిస్తూ శ్రీ పరవస్తు చిన్నయసూరి గారు పంచతంత్రములలో పేర్కొన్న వాటిపై ఒకసారి పరికిస్తే ఎంత మధురంగా అర్థమవుతుంది. వ్రాసారో మనకు అర్ధమవుతుంది.
“అర్థము పురుషార్థముల లోపల ఉత్తమము, అర్థవంతునకు అసాధ్యంబైనది. లోకమునందేదియు గానము, పురుషుడు న్యాయము తప్పక, జరామరణములు లేనివాని వలె, ఏ ఉపాయము చేతనైనను ధనము సంపాదించవలె, २०० సంపాదించితిపో ఇంకేల అని తలయరాదు” అన్న వచనములు ఆయన ఆనాడే పేర్కొనడము మనకు మార్గదర్శకముగా యున్నవి.
అలాగే శ్రీ బద్దెనగారు వ్రాసిన సుమతీ శతకములోని ఒక పద్యమైన సరితా వచ్చిన వచ్చును, సలలితముగ నారికేళ సలలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరిణిని సుమతీలో అర్థమును తీసుకొనిన మానవ జీవితంలో డబ్బు (సంపద) కొబ్బరి కాయలోని నీరు వచ్చినట్లు (దారి) తెలియకుండా వచ్చునని, దారిద్ర్యము డబ్బు పోవుట కూడా ఏనుగు మింగిన వెలుగపండులాగ పోతుందని పోల్చి వ్రాసారు. ఏనుగు మింగిన వెలుగపండును అది బహిష్కరించిన తరువాత పై ఆకారంలో ఎలాంటి మార్పు లేకున్నా లోపల గుజ్జ మాత్రం: మాయమవుతుందని ఉదహరించారు.
రామదాసుగా ప్రసిద్ధి పొందిన శ్రీ కంచర్ల గోపన్నగారు వ్రాసిన దాశరధి శతకము కూడా బహు ప్రాచుర్యము పొందినది. అందులోనూ ఎన్నో నీతి వాక్యాలను ‘ప్రభోధించారు. వీరుకాక శ్రీ అర్పుల నరసయ్య రచించిన కుమార శతకము, శ్రీ మారద వెంకయ్యగారు రచించిన భాస్కర శతకము, శ్రీ ఏను ఏ లక్ష్మణ కవి రచించిన భర్తృహరి సుభాషితాలు, శ్రీ కవి చౌడప్ప శతకము పలు ప్రజాదరణ పొందిన పుస్తకాలే.
బహు సరళ పదాలను ఉపయోగించిన వారిలో ‘వేమన’ ఎక్కువగా చెప్పుకోవచ్చు. శ్రీ కవి చౌడప్ప శతకంలో వారి రచనా శైలిని పరీక్షిస్తే శృంగారం పాలు కొంచెం ఎక్కువైనా ఆయన పద్యాలు నాడు ప్రజా రంజకంగా మారాయి..
ఇంటికి తాళము అవసరము. విల్లుకు తాడు, వక్షోజానికి (చన్నులకు) రవికె, కంటికి రెప్ప అవసరమని (భద్రత) అని ఆరున ఎంతో చక్కగా శృంగారమయంగా చెప్పడం ఒక మచ్చు తునకగా పేర్కొనవచ్చు.
అలా సామాన్యులకు సైతం చదివిన వెంటనే అర్థం చేసుకునేంత సరళమైన భావంలో వ్రాసిన చక్కని సుభాషితాలు మానవ జీవితానికి ఎంతో ఉపదయోగపడే విధంగాను, వాటిని ఆచరిస్తే మహోన్నత వ్యక్తిగా ఎదిగే విధంగా వ్రాసిన సూక్తులన్న పుస్తకాలు నేటి సమాజ వేగంలో వెనుకబడి పోవటం జాతికి ఎంతో నష్టంగా భావించాలి. నేటి విద్యార్థులకు ఇలాంటి పుస్తకాల గురించి తెలియజెప్పటానికి, అవి కలకాలం నిలవడానికి ప్రభుత్వాలు మేధావులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్నిగుర్తించాల్సి ఉంది.
.రచన…ఎం. నాగశేషకుమార్