పిల్లలు ఆటలు ఆడుతుంటారు. కాని ఓడగానే ఏడుస్తుంటారు. అంతలోనే పెద్దవాళ్ళొచ్చి నీవే గెలిచావంటూ సముదాయించి గెలిపించడానికి తెగ ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు ఏడుపు ఆపి నవ్వడం ప్రారంభిస్తారు. కాని గెలవాలనుకోవడం మంచిదే కాని ఓడటాన్నీ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు గెలవడం కోసం ఆడకండి. ఆట ఆడితే వచ్చే సంతోషాన్ని పొందడాని కోసం ఆడండి. ఎంత చక్కగా, ఇష్టంగా, శ్రద్దగా ఆడితే మీరు విజయానికి అంత చేరువైతారు. కాబట్టి విజయంకోసం కాదు ఆట పై ఇష్టంతో ఆడితే ‘ఆటోమేటిక్’ గా గెలుపు మీ సొంతమైతుంది. ఆటలు ఆడితే వచ్చే సంతోషం కోసమే ఆడితే…ఆపై గెలిస్తే దాన్ని ‘బోనస్’ గా స్వీకరించండి. మీకు గెలుపు కంటే ఆడటమే ముఖ్యమైతే ఒకవేళ ఓడినా అంతగా బాధ పడాల్సిన అవసరం ఉండదు.
మీరు విన్నర్ అవుతారా… రన్నర్ గా మిగులుతారా…
నిజానికి ‘విన్నర్’ కంటే ‘రన్నరప్’ గా ఉండటమే జీవితానికి వన్నె తెస్తుంది. నేనైతే ‘క్లాసు’లో విద్యార్ధి ‘ఫస్ట్’ రావడం కంటే’సెకండ్’ వస్తేనే జీవితంలో చాలా బాగా స్థిరపడతారని చెబుతాను. అదెలాగో చూడండి. మీ స్కూల్లో మీరే ‘ఫస్టు’ అనుకోండి. అంటే హైస్కూలు’ స్థాయిలో తొమ్మిదో ‘క్లాసు’లో, పదో
‘క్లాసు’లో ‘ఫస్టు’ వచ్చారనుకోండి. ఆ తరువాత ‘టీ.సి.’ తీసుకుని వేరే ‘కాలేజీ’లో చేరతారు. కాని అక్కడ వాతావరణం వేరు. ‘లెక్చరర్లు’ మారుతారు. కొత్తగా చేరిన విద్యార్థుల్లో మీ కంటే బాగా చదివే విద్యార్ధి ఉన్నారనుకోండి. ఇంటరులో మరో విద్యార్ధి ‘క్లాసు’లో ‘ఫస్ట్’ వస్తే మీరు దాన్ని ‘పాజిటివ్’ గా తీసుకుని మరింత బాగా చదివితే సరే. కాని మీరు నిరాశ పడితే మరింత వెనకపడి పోతారు. గతంలో పదవ తరగతి వరకు మీరు ‘ఫస్ట్’ వచ్చే విద్యార్థి కావటాన ఈ సారి ‘సెకండ్’ వస్తే దాన్ని స్వీకరించే మనస్థత్వం ఉండాలి. దాన్ని ‘ఛాలెంజ్’గా తీసుకుని మరింత బాగా చదివితే ‘ఫస్ట్’ రావచ్చు. కాని ఈ స్పూర్తి మీరు ‘సెకండ్’ వస్తే వస్తుంది. ‘ఫస్ట్’ వస్తే తల పొగరు వస్తుంది. అందరి కంటే నేనే ‘ఫస్టు’ అనే అహంకారం మీలో పెరుగుతుంది.
మీరు అందర్లో ‘బెస్ట్’ అనుకుని మీలో ప్రతి ఒక్కరినుంచి ప్రత్యేక గుర్తింపు కోరుకుంటారు. కాని చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన తరువాతనో.. పెళ్ళి అయి జీవితంలో స్థిర పడ్డ తరువాత మీరు మరే విషయంలోనో వెనెకబడితే దాన్ని తట్టుకునే మనధైర్యం ఉండక పోతే ఇక అంతే. అంటే మీరు ‘క్లాసు’లో ‘ఫస్టు’ వచ్చి, ‘సక్సెస్’ కు అలవాటు పడి ఉంటారు. హఠాత్తుగా ‘ఫెయిల్యూర్’ ఎదురై, మీరు జీవితంలో వెనుక బడిపోతే దాన్ని ఎదుర్కొనే మనసైర్యం ఉ ండకపోవచ్చు. చిన్న, చిన్న వాటికే మీరు కుంగి పోవచ్చు. జీవితంలో చిన్న, చిన్న విషయాలకే నిరశతో ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు పేపర్లో ఎన్నో చేస్తుంటాం. ఓ రెండు రోజుల క్రిందటే ఇలాంటి వార్త ఒకటి చదివాను. ఇంట్లో తగాదాతో ఓ తహసిల్దార్ ఆత్మచేసుకున్నాడని. తహసీల్దార్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఆ స్థాయిలో ఉన్న అధికారే అలా చేస్తే ఇక సామాన్య రైతు అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆశ్చర్య పడేదేముంది. అలాగే పదవ తరగతి లో ‘ఫెయిల్’ అయినామంటూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలూ పేపర్లో చూస్తుంటాం. అంటే ఆ విద్యార్థులు మానసిక పరిస్థితి బాగా లేదన్నట్లే. అంతే కాదు ఆ విద్యార్ధికివ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన జ్ఞానం కావాలసిందే. ఒకసారి ఓడితే… గెలువటానికి కావలసిన నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం దొరుకుతుంది. గెలుపు కన్నా ఓటమే జీవితాన్ని మరింత తీర్చిదిద్దుతుందన్న విషయాన్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే ఓక్కోసారి ఓటమి మీ జీవితంలో ఓ పెద్ద గెలుపుకు పునాది కావచ్చు. అందుకే ఏది జరిగినా మన మంచికే అని ‘పాజిటివ్’ గా ఆలోచించి, జరుగబోయేదాని గురించి ఆలోచించాలి.