చదువుకునే పిల్లలు ముఖ్యంగా తమ శరీరాకృతిని మలుచుకోవడంపై శ్రద్ద వహించాలి. శరీరం మరీ సన్నగా కాకుండా. మరీ లావుగా కాకుండా సరైన ఆకృతిలో ఉంచుకునేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు తమ శరీరాకృతిని మలచుకోవడంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగానికే కాదు. పెళ్ళి కావాలన్నా మంచి శరీరాకృతి కావాలన్న విషయం కుదురుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితంలో పెళ్ళీ ఒక ముఖ్య ఘట్టమే కదా…
ఉద్యోగమైనా మార వచ్చు. కాని పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకోలేం కదా…కాబట్టి పెళ్ళి కోసమైనా ప్రతి యువతీ, యువకుడూ తన శరీరాకృతి పై శ్రద్ధ వహించాలి. అందుకోసం నడక, శ్రమ, ఎక్సర్సైజ్ మితాహారం లాంటి వాటిని అలవరచుకుంటే కొంతైనా శరీరాకృతి మన స్వాధీనంలో ఉంటుంది.
విద్యార్థులు ఉదయాన్నే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి. ప్రాత: కాల సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకితే మన ముఖం కొత్త కాంతులు వెదజల్లుతుంది. ఆ విషయం ఎవరూ గ్రహించరు. సూర్యోదయాన్నే లేచిన వారు చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారు.
బాడీ లాంగ్వేజ్…
మీరు ‘సక్సెస్’ సాధించాలంటే ముందు మీ ‘బాడీ లాంగ్వేజ్’ ని మార్చాలి. అంటే మిమ్మల్ని చూసేవారికి మీ పై మంచి అభిప్రాయం కలిగించే విధంగా ప్రవర్తించడం. మంచి ‘డ్రెస్ కోడ్’… మంచి ‘హేర్ కట్… మంచి మాట… ఇలా ముఖ్యంగా ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్’ అనే విషయం మీరందరూ వినే వింటారు. అంతెందుకు మన సాంప్రదాయంలో పెళ్ళికి ముందు పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్ళికూతురు, పెండ్లికొడుకు ఒకరినొకరు చూసుకుంటారు. ఏం చూసుకుంటారు. చూడగానే ఏం తెలుస్తుంది.
ఈ ప్రశ్నలకు జవాబే… ‘ఫస్ట్ ఇంప్రెషనన్.. గుడ్ ఇంప్రెషన్…’ అంటే చూడగానే ‘ఒకరికొకరు నచ్చారని’ చెబితేనే… పెళ్ళి కోసం మరో అడుగు వేస్తారు పెద్దలు. మన సంస్కృతిలోని పెళ్ళి చూపుల ఘట్టంలోనే ఈ విషయం నిబిడీకృతమై ఉంది. కాని మనం దాన్ని గ్రహించం. కాబట్టి, మనం చూడగానే మన పై సదభిప్రాయం కలిగేట్లుగా వేషభూషణలుండాలి.