Sunday - December 22, 2024

మీ శత్రువులు ఎవరు?

విద్యార్ధులు అందరూ మీకు పరీక్షల్లో మార్కులు ఎక్కువ ఎందుకు రాలేదని అడిగిన ప్రతి సారీ వంద కారణాలు చెప్పి తప్పించుకుంటారు. కాని అది తప్పని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఉదాహరణకు ‘లెక్చరర్ పాఠాలు సరిగా చెప్పలేదు అని జవాబు చెప్పారనుకోండి. మరి క్లాసులో మిగతా విద్యార్థులకు ఎలా ఎక్కువ మార్కులు వచ్చాయని మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి.
ఒకే ‘లెక్చరర్’ అందరికీ పాఠాలు చెప్పాడు. మార్కులు నాకే ఎందుకు తక్కువ వచ్చాయి? అని ఆలోచించాలి. అప్పుడు ఇంకో సమాధానం వస్తుందనుకోండి. వాళ్ళు ‘ప్రవేటు ట్యూషన్’ కు పోయారని. సరే వారు పోతే మిమ్మల్నీ ‘ట్యూషన్’ వెళ్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నిస్తే జవాబు మరోటి వస్తుంది. ‘డబ్బుల్లేవని సమాధానమొస్తే, అవి ఎలా వస్తాయని… మాది బీద కుటుంబమని’ అన్నారనుకోండి. ‘ఆ డబ్బులు మీరే ఎందుకు సంపాయించొద్దు?’ అని ప్రశ్నించుకోవాలి. సమయం లేదని అంటారనుకోండి…కొంచెం రోజూ కంటే ముందు లేవాలి. సమయం అదే మిగుల్తుంది. శత్రువులు ఎవరో కాదు. ‘మీ అభివృద్ధికి మీరే అడ్డు’ అన్న విషయం తెలుసుకోండి. జీవితంలో పైకి రావాలంటే మీరు నిరంతరం శ్రమించాల్సిందే. దానికి మరో ‘షార్ట్ కట్’ లేదు. ‘షార్ట్ కట్’ ఉన్నా అది శాశ్వతం కాదు. మీ శత్రువు మీ శరీరమే.. మీరు జీవితంలో పైకి రావాలంటే మీరు ముందుగా మీ శరీరం పట్ల కఠినంగా వ్యవహరించండి.
ఉదాహరణకు ఇంటరు విద్యార్థి ఇంట్లో తన తమ్ముడికి ఏదో పాఠం చెప్పుతున్నారనుకోండి. అతడికి ఓ ప్రశ్న కు సమాధానం రాదనుకోండి. వెంటనే దాన్ని పది సార్లు రాసి తీసుకురా… అని చెపుతాడు. పాపం ఆ పిల్లాడు పది సార్లు రాయలా?.. అన్నట్లు మొఖం పెట్టి.. ‘తప్పదా’ ..అంటూ అడుగుతాడు. అప్పుడు… ‘తప్పదు రాయాల్సిందే’ అంటాడు.. పిల్లాడికేమో అది కష్టంగా తోస్తుంది. కాని పాఠం చెప్పేవాడికి మాత్రం వాడికి రావాలంటే పదిసార్లు రాయక తప్పదన్న నిర్ణయానికి వచ్చి పిల్లాడి పట్ల ‘కఠినంగా’ వ్యవహరిస్తాడు. అదే ఆ పిల్లవాడినే స్వయంగా నీవే నిర్ణయించుకో, రాస్తే రాయి.. లేక పోతే నీ ఇష్టం… అని అంటే ‘రేపు రాస్తాలే’ అని ఆడుకోవడానికి పోతాడు…. లేదంటే ఒక్కసారో, రెండు సార్లో రాసి, బద్దకం వేసో, వేళు ఏ నొప్పిపుడుతున్నాయనో, మరో రోజుకు వాయిదా వేస్తాడు. అయితే మనం ఈ సన్నివేశం నుంచి ఏం నేర్చుకోవాలంటే పిల్లవాడి పట్ల అతను ఎంత కఠినంగా వ్యవహరించాడో.. ఎవరికి వారు తమ పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలి. మన శరీరం ‘సుఖం’ కోరుకుంటుంది. కాని దానికి ‘సుఖం రుచి చూపవద్దు. ఈ బ్రహ్మాండంలో ఏదీ ఉ చితంగా, సునాయాసంగా రాదు. వస్తే అది ఎంతో కాలం ఉండదు. అది గాలి బుడగలాంటిదే. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అలాంటిది వచ్చినా రాకపోయినా ఒకటే.

కాబట్టి శాశ్వతమైన ఫలితం రావాలంటే కష్ట పడాల్సిందే. మరోమార్గం లేదు. జీవితంలో సక్సెస్ కు అడ్డు మార్గలు లేవు. ఉ న్నదల్లా ఒకటే. అది రాజ మార్గమే. అదే కష్టపడే మార్గమే. ఎవరెస్టు సిఖరం ఎక్కాలంటే ఎన్నో కష్టనష్టాలు తప్పవు. అయితే అది అసాధ్యమైతే కాదు. కాని ఒక్క సారి కష్టపడితే జీవితాంతం ఆ ఫలితం మాత్రం మీ వెంటే నీడలా ఉంటుంది కదా.
కష్టపడితేనే ఫలితం సాధ్యమైతుందన్న నగ్న సత్యంతో పాటు జీవితాంతం ఫలితాన్ని మనం అనుభవించ వచ్చని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates