Monday - December 23, 2024

‘పర్సనాలిటీ’ని ఎలా డెవలప్ (వ్యక్తిత్వకాసం) చేసుకోవాలి?

మనం కనిపించే మన బాహ్యరూపంతో పాటు అంతర్ముఖాన్నీ తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఏ పనిలో నైనా సఫలీకృతం (సక్సెస్) అవుతాం. ‘సక్సెస్’ ఎవరికి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మనం చేసే పనిలో ‘సక్సెస్’ సాధించాలనుకుంటారు. అంటే ఉదాహరణకు ప్రతి విద్యార్థీ తన క్లాసులో ఉత్తీర్ణుడు కావాలని కోరుకుంటాడు. ‘ఫస్ట్’ రావాలి అని కోరుకుంటారు. ఎవరూ ‘ఫెయిల్’ కావాలని కోరుకోరు. అలాగే వ్యాపారస్ధుడు తన వ్యాపారం బాగా నడిచి లాభాలు గడించాలనుకుంటాడు. రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవాలనుకుంటాడు. ఆటగాడు ప్రతి పోటీలో గెలవాలని కోరుకుంటాడు.. ఎవరూ ఓడిపోవాలని కోరుకోరు. ఓడిపోవాలనికోరుకున్నవాడు ఆట ఆడటమే ‘వేస్ట్’ కదా.. కాని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆట ఆడినవారందరూ గెలిస్తే ఇక ఓడేవారెవరు. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే గెలవడానికే ఆడినా ఒకేసారిఅందరూ గెలవలేరు. అయితే ఓటమిని కూడా మనం ఆస్వాదించడమే వ్యక్తిత్వ వికాసంఅంటారు. నేటి ఓటమి రెపటి గెలుపుకు నాంది కావాలి. ఓడినా మరో సారి గెలుపు సాధించే వరకు నిరంతర ప్రయత్నం చేయడమే గొప్ప వ్యక్తిత్వ మన్న విషయం తెలుసుకోవాలి. ఆటలో ఓడిపోగానే నిరాశపడకుండా గెలిచిన వాణ్ణి మనస్పూర్తిగా అభినందించడమే వ్యక్తిత్వ వికాసం. గెలచిన వాడి గెలుపుకు కారణాలతో పాటు ఓటమికి గల కారణలు తెలుసుకోని విశ్లేషించడమే వ్యక్తిత్వ వికాసం. గజినీ మహ్మద్ భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. ఓడిపోయిన ప్రతిసారి బతుకు జీవుడా అని పారిపోయి తిరిగి యుద్ధానికి కావలసిన సైన్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ దండయాత్ర కొచ్చాడు. 16 సార్లు ఓడిపోయినా నిరాశపడకుండా తిరిగి యుద్దానికి కావలసిన ప్రయత్నాలు చేశాడు. గజనీ మహమ్మద్ కధ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే.
‘ఎలక్ట్రిక్ బల్బ్’ ను కనిపెట్టిన ప్రముఖ సైంటిస్టు ధామస్ ఎడ్సన్’ కూడా 13 సార్లు విఫలమైన తరువాత 14 వ సారి ‘బల్బ్’ కనిపెట్టడంలో ‘సక్సెస్’ అయినాడు. ప్రతిసారీ ఎంతో కష్టపడి ‘బల్బ్’ కనిపెట్టానికి చేసిన ప్రయత్నంలో “ఫెయిల్’ అయినా నిరుత్సాహ పడలేదు. ప్రతిసారి తన ప్రయత్నంలో ఉన్న లోపాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసాడు. అతన్నీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన లక్ష్యం నెరవేరే వరకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొన్ని నిరంతరం ప్రయత్నించడమే ‘సక్సెస్’ సూత్రానికి మూలం. లక్ష్యం నెరవేరలేదని నిరుత్సాహ పడి మనసు మార్చుకోవద్దు. ‘సక్సెస్’ రావాలంటే నిరంతరంగా కృషి చేయాలి. ఓటమికి గెలుపు ఎంతో దూరంలో ఉండదు. కాని గెలుపు సాధించేలోపే నీరసించి వెనుకడుగు వేస్తే గెలుపు వెక్కిరిస్తూనే ఉ ంటుంది. మీకు ఇక్కడ మరో విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరికి సీతాకోక చిలుక తెలుసుకదా. సీతకోక చిలుక జీవిన ప్రక్రియ తెలుసు కుందాం.. ముందు లార్వా.. తో ప్రారంభమై నాలుగు దశల్లో సీతకోక చిలుకలా తయారవుతుంది. కాని గమనించాల్సిన విషయం ఏమిటంటే సీతాకోక చిలుక కంటే ముందు దశ గొంగళపురుగు దశ అన్న విషయం అందరు విద్యార్థులకు తెలుసు. గొంగళి పురుగు 21 రోజుల తరువాత సీతాకోక చిలుక లా బయటికి వస్తుంది. కాని సీతాకోక చిలుకగా మారక ముందు గొంగళి పురుగును చూడగానే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దాన్ని ముట్టుకోవాలన్న ఆలోచన కూడా రాదు. కాని సీతాకోక చిలుకగా మారిన తరువాత అది ఎగురుతుంటే దాన్ని పట్టుకుని ఆడుకోవాలని అనిపిస్తుంది. చిన్న పిల్లలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించే సంఘటనలను చూస్తూనే ఉంటాం. కాని ఇక్కడ మనం గోంగళపురుగు దశనుంచి సీతాకోక చిలుకలా మారితే అందరూ మెచ్చుకుంటారన్న విషయం తెలుసుకోవాలి. ఏదైనా మనం సాధిస్తే, గొప్పవాళ్ళమైతే ఈ ప్రపంచమే మనకుదాసోహమంటుంది. అందకు మనం కష్టపడితే నష్టమేంటి. ఆ తరువాత అంతే జేజేలే కదా. ఈ ప్రపంచేమే దాసోహం అవుతుంది కదా. ఇలా ప్రతి విద్యార్థి కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates