ఇంగ్లీషులో ‘పర్సనాలిటీ’ అంటే తెలుగులో వ్యక్తిత్వం. వ్యక్తిత్వానికి చదువుకు ఏం సంబంధం…. అసలు ఉద్యోగానికి అర్హతలు చదువే కదా… అంటే.. డిగ్రీ, పి.జీ., పి.హెచ్.డీ.. ఒక్కో ఉ ద్యోగానికి వాటికి సంబంధించన కోర్సులుంటాయి. అంటే ఆ ఉ ద్యోగం చేయటానికి కావలసిన నైపుణ్యాన్ని పెంచేవి. అలాగే టీచర్ ఉద్యోగానికి ….టీటీసి (డిఎడ్),.. బి.ఎడ్., డాక్టరు ఉద్యోగానికి ఎం.బి.బి.ఎస్.. ఇంజనీర్ కావాలంటే బీ.ఈ., బీ.టెక్….. ఇలాంటివే కదా… కొత్తగా ఈ పర్సనాలిటీ పరీక్షలేమిటి… అని అందరికీ అనుమానం వస్తుంది. కానీ పిల్లలందరూ తెలుసుకోవాల్సింది. మరొకటి ఉంది. అసలు ఉద్యోగానికి కావాలిసింది చదువు… అంటే డిగ్రీ మాత్రమే… కాని జీవించడానికి కావలసింది వ్యక్తిత్వ వికాసమే (personality developmen). జీవితాన్ని జీవించడానికి మనకు కాలేజీల్లో డిగ్రీలు సంపాయించుకుంటే సరిపోదని, చదువుకోకపోయినా ప్రతి మనిషికి సంస్కారం ముఖ్యమని తెలుసుకోవాలి. సంస్కారానికి చదువుకు ఎంతో తేడా ఉంది. అలాగే చదువుకు, విజ్ఞతకూ (జునబఎఫ్ ఱశీఅ ఉ ఔఱంశీఎ) మధ్య కూడా చాలా తేడావుంది. ముందు విద్యార్థులు వీటి మధ్య తేడాని తెలుసుకోవాలి. కొన్ని క్లిష్ట సమయాలలో మనం విజ్ఞతతో వ్యవహరించాలి అని అంటుంటారు మన పెద్దలు. అంటే. విజ్ఞతతో కూడిన ప్రవర్తన అంటే ఏమిటి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంగ్లీషులో ‘పర్సనాలిటీ’ అంటే తెలుగులో అర్ధం స్వరూపం అని సహజంగా అని చెప్పుకుంటాం. కాని సైకాలజీ’ (మానసిక శాస్త్రం) లో ‘పర్సనాలిటీ’ అంటే మరో విధంగా చెప్పవచ్చు. ‘సైకాలజీ’ శాస్త్రంలో ‘లాటిన్’ భాషలో ఉన్న ‘పర్సోనా’ కావతీశీఅ) నుంచి తీసుకుంది. ‘పర్సొనా’ అంటే ముసుగు అన్న అర్ధం. నటులు తమ పాత్ర కనుగునంగా ధరించే ముసుగు అని అర్ధం. అంటే ఓ నటుడు రాజు వేషం వేస్తే ఆ పాత్రకు తగ్గ దుస్తులు ధరిచడం, మరో సేవకుడి పాత్ర వేస్తే అందుకు తగ్గట్లు బట్టలు వేసుకోవడం అన్నమాట. అంటే పాత్రకు తగ్గట్టుగా ముసుగు ధరించడం. అంటే మనం కూడా మన పాత్రకు తగ్గట్టుగా ముసుగులను ధరించి, ఆ పాత్రలో జీవించక పోయినా కనిసం నటిస్తే ఆ పాత్ర రక్తి కడుతుంది కదా.. అందుకే మనం జీవితంలో కూడా చేసే పనికి లేదా ఉద్యోగానికి తగ్గట్లుగా ప్రవర్తించడంలో మెలుకువలు నేర్పించేదే ‘పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సు. మన ప్రవర్తనను మూడు రకాలుగా విభజించవచ్చు.
ఒకటి… సహజంగా ఉండేది. రెండు… తెచ్చిపెట్టుకునేది (కృత్రిమం), మూడు..సంధర్భానుసారం, సమయానుకూలంగా మార్చుకునేది. ఇదే చాలా ముఖ్యమైనది. అంటే మనం చేసే ఉ ద్యోగానికి కావలసిన విధంగా (ముసుగు ధరించడం) వ్యవహరించడం. మన భారతీయ సంస్కృతి లో ‘పర్సనాలిటీ డెవలప్ మెంట్’ అంటే సమయ స్ఫూర్తి, సంస్కారం, విజ్ఞత అన్నీ కలగలసిన వ్యక్తిత్వం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మనం భారతీయ సంస్కృతిని అలవరుచకుని, పెద్దలు చెప్పిన నాలుగు మంచి మాటలు ఆచరిస్తే అటోమేటిక్ గా మనకు ఆ విద్య అబ్బుతుంది. కాని మనం పరదేశ సంస్కృతి మోజులో పడి భారతీయ సంస్కృతి పట్ల చిన్నచూపు చూపుతున్నాం.
ఉదాహరణకు మన తెలుగులో ముఖ్యంగా ఎన్నో రకాల సుభాషి తాలున్నాయి…శతకాలున్నాయి… అంటే మంచిమాటలు కాని వాటిని ఎవరూ చదవటంలేదు. వాటిలో ముఖ్యమైనది… వేమన శతకం అని చెప్పవచ్చు…జీవితానికి పనికి వచ్చే చాలా విషయాలను వేమన పామరులకు సైతం అర్ధం అయ్యేట్లు పద్యాల రూపంలో మనకు చెప్పారు. ఓ పదేళ్ళ క్రితం ఏ గ్రామంలో చూసినా, ఏ రైతును పలకరించి నా, గడ గడా వేమన శతకంలోని పద్యాలు పాడేవారు. కాని ఈ రోజుల్లో పదో తరగతి పాసైన విద్యార్థికీ పట్టు మని పది వేమన పద్యాలు రావన్నది నగ్న సత్యం. ఉదాహరణకు అందరికీ సుపరిచితమైన ఉ ప్పు, కప్పూరంబు నొక్కపోలికనుండు, చూడ చూడ రుచుల జాడవేరయా.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వధాభి రామ వినుర వేమ… అన్న పద్యాన్ని చూద్దాం. ఈ పద్యంతో మనం జీవితానికి సంబంధించిన చాల పెద్ద విషయాన్ని సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఉప్పూ, కర్పూరము.. రెండూ చూడటానికి ఒకేలాగ… అంటే తెల్లగానే కనబడతాయి.. కాని వాటి రుచిలో మాత్రం చాలా తేడా ఉంటుంది… పురుషులందరూ ఒకేలాగ కనిపించినా వారిలో పుణ్యపురుషులు (మంచివాళ్ళు) వేరుగా ఉంటారు. దాన్ని గ్రహించాలని వేమన చాలా చక్కగా వివరించారు. అంటే మనం కండ్లతో చూసిన దాన్ని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు.
ఇలాంటి విషయాలన్నీ కలగలిపిన విజ్ఞత తో కూడిన ప్రవర్తనే, మన వ్యక్తిత్వన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మన భారతీయులకు వ్యక్తిత్వ వికాసం అనే సబ్జక్టు కొత్తదేమీ కాదు. విద్యారులు ఇలాంటి చిన్న, చిన్న విషయాలను మరింత ఆకళింపు చేసుకుని అమలు చేస్తే గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తులుగా మారుతారు. అది నిస్సందేహం. అయితే ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి.. ఇంగ్లీషులో పర్సన్…. అంటే మనిషి… కాని పర్సనాలిటీ… అనే పదంలో రెండు రకాల అర్ధాలు ఇమిడి ఉన్నాయి. పర్సనాలిటీ… అంటే మనకు కనిపించే బాహ్య స్వరూపం… రెండోది అంతర్గతం… మనం తరుచుగా కండలు తిరిగి, ఒడ్డూ పొడుగు ఉన్న మనిషిని చూడగానే ఏం ‘పర్సనాలిటీ’ రా బాబూ అని అబ్బుర పడతాం… అలాగే అంతర్గతంగానూ నిజాయితీ, పరోపకారం, సమయస్పూర్తి, మృధు స్వభావి ఇలాంటి సుగుణాలు ఉన్న మనిషి గురించి చెప్పుకునేటప్పుడు కూడా “గ్రేట్ పర్సనాలిటీ” అని అంటుంటారు. అంటే మనిషికీ వన్నె తెచ్చేది బాహ్య(ముఖం) రూపమే కాకుండా అంత: స్యభావమూ (అంతర్ముఖం) కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. పైన కనిపించే దేవుడిచ్చిన ముఖాన్ని మరింత అందంగా మార్చుకునే అవకాశం ఎలాగూ లేదు. మహా అంటే ముఖానికి ‘పౌడరు’ రాసుకుంటాం. లేదా ‘ఫయిర్ అండ్ లవ్లీ’ రాసుకుంటాం. కాని దాని వల్ల మన ముఖం మాత్రం అందంగా కాదు. కొద్ది సేపు నూనె కనబడకుండా చేసుకోవచ్చేమో. కాని మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే అంతర్ముఖాన్ని అందంగా తీర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటే అందరిలో మంచి పేరు సంపాదించుకోవచ్చు. గొప్పవారిగా పరిగణింప బడవచ్చు.
Monday - December 23, 2024