Monday - December 23, 2024

వ్యక్తిత్వ వికాసం… పర్సనాలిటీ డెవలప్ మెంట్…

ఈ మధ్యకాలంలో చాలా వినిసిస్తున్న మాట. ముఖ్యంగా సాఫ్టవేర్ (కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి) ఉద్యోగాల వేటలో ఉన్న విద్యార్ధులు ఎక్కువగా వినే మాట. రాష్ట్రంలో మల్టీనేషనల్ కంపెనీల (అంతర్జాతీయ కంపెనీల) స్థాపన తరువత వాటిలో జీతాలు మొట్టమొదలే అయిదు అంకెల జీతంతో ప్రారంభమవుతుండం, ఇంటర్ చదివిన వారికీ బీపీఓ లాంటి ఉద్యోగంలో కనీసం 15000 వేల రూపాయల జీతంతో ప్రారంభం అవుతుండటంతో డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు పర్సనాలిటీ డెవెలప్ మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికంటూ కొత్తగా కోచింగ్ సెంటర్లు వెలిసాయి. నిజానికి భారతీయ సంస్కృతిలోనూ, ఇక్కడి విద్యావిధానంలో పురాతన కాలంలోనే వ్వక్తిత్వ వికాసం అనే విషయం పొందు పరచబడ్డది. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఎందరో మహాత్ములు, ప్రముఖ రచయితలు, చరిత్రకారులు దైనందిన జీవితంలో పామరులు సైతం ఉన్నత విలువలు పాటించాలని ఎన్నో సూక్తులు చెప్పారు. మన పురాణాలు, రామాయణ, భాగవత ఇత్యాది కావ్యాలలో అంతర్లీనంగా ఎన్నో విషయాలున్నాయి. వాటిలోని సూక్ష్మాన్ని గ్రహించితే మనిషికి గొప్ప వ్యక్తిత్వమే కాక జీవితంలో మహోన్నత స్థానం దక్కుతుంది. కాని మనం బ్రిటిష్ విద్యా విధానం పై ఉన్న మోజులో పడి మన సంస్కృతిలో ఉన్న చిన్న, చిన్న విషయాలను కూడా గ్రహించక పోవడంతో ఈ ఖర్మ ఏర్పడ్డది. మనం రోజూ పత్రికల్లో చిన్న, చిన్న విషయాలకే విద్యార్దులు, ప్రేమికులు, ఒకరేమిటి పెద్దలు, పిల్లలు అనే భేధం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వార్తలు చదువుతుంటాం.. బంగారం లాంటి జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. పరీక్షల్లో పాస్ కాకపోయినా పర్లేదు. పరీక్షల్లో ఫెయిల్ అయితే సప్లమెంటరీ రాసి పాస్ కావచ్చు. కాని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులకు తిరిగి జీవితం తీసుకురాలేము కదా. అందుకే ఈ రోజుల్లో విద్యార్థులకు జీవితంలో గెలవాలంటే పర్సనాలిటీ డెవలప్ మెంట్ ముఖ్యం అయిపోయింది కాబట్టి మొదట విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానం పొందగలగుతారు.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates