పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఎప్పటికైనా అనుసరించాల్సిన విషయమే. కానీ మనం ప్రకృతిని హరిస్తూ మన ఎదుగుదల, మనుగాడకు ముప్పు తెచ్చేలా చేసుకుంటున్నాం. మానవ సుఖ జీవనానికి అటవీ సంపద ఎంతో అవసరమని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వృక్షాలు మనిషి ఆశలకు ప్రాణాలు అర్పించి ఎండమావులుగా అవుతున్నాయి. తద్వారా పర్యావరణ కాలుష్యానికి గురవుతున్నాం. వందలాది వృక్షాలు అటవీ జంతువులు కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరుతో జీవనాన్ని అంతం చేసుకుంటున్నాం.
ప్రకృతిపై మనిషి పగబడుతున్నాడు. చెట్లను నరికి నదులను కలుషితం చేస్తుండు. ఈ రోజు పకృతి ప్రపంచ సమస్యగా మారింది. వాస్తవంగా మనం చూస్తున్న అడవులు కళ్ళముందే అంతరించిపోతున్నాయన్నది నిజం. విషపూరితమైన ప్రాణవాయువు నుంచి బయట పడాలంటే నరికిన చెట్ల స్థానంలో కొత్త చెట్లను కు ప్రాణం పోయాల్సిందే. ఆడవులను కాపాడాల్సిందే. భూమిపై 33% అడవులు ఉండాలన్నది మన అటవీ విధానం. కానీ ఇప్పుడు 20 శాతానికి పైగా అటవీ సంపద తగ్గిపోయింది. పోడు వ్యవసాయం, ఆక్వా సాగు పేరుతో చెట్లు, మడ అడవులను మాయం చేస్తున్నారు. ప్రకృతి ఆధారంగా మానవ అభివృద్ధికి పాటుపడితే భవిష్యత్తులో సమస్యలే తప్ప సుఖవంత జీవితం దొరకదు.
ఇటీవల పార్లమెంట్లో దేశంలోనే అడవులపై ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో 33 లక్షలకు పైగా వృక్షాలను ప్రాజెక్టుల పేరుతో నరికేసారని కేంద్ర ఫారెస్ట్ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మనకి అర్థమవ్వలసిన అంశం. దీనిపై ప్రజానీకం ఆలోచన చేయాలి. అడవుల మాయం కావడం వల్లే భూతాపం ప్రమాదకరమైన స్థాయికి పెరిగిపోయింది. వాతావరణంలోని మార్పులతో వరదలు, వర్షాలు ముంచెత్తి తీవ్ర నష్టం జరుగుతోంది.
మనిషికి పకృతి మొదటి ఆస్తి. విలువైన వనరులను పొదుపు చేసి తరువాత తరాలకు అందించడం మన ముఖ్యమైన విధి గా ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉండాలి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధాలు, రసాయనాలు, కలుషిత వాయువుల నుంచి మానవ జీవనాన్ని కాపాడాలంటే.. పకృతి తలచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే విష వాయువులతోనే మనిషి ప్రాణవాయువు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నదులన్నీ కలుషితం అయిపోతాయి. వరల్డ్ లోనే మొదటి పది కాలుష్య నగరాల్లో భారత్ 7 వ స్థానంలో ఉందనేది బాధాకరమైన విషయం. ప్రకృతి అటవీ సంపదపై మన ఆలోచనను మార్చుకోవాలి. అభివృద్ధికి పకృతికి ముడి పెట్టకుండా ముందుకు సాగాలి. కానీ అలా లేదు… పరిస్థితి ప్రభావం అంటూ విధ్వంసానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. మన స్వార్థ పూరితమైన ఆశకు నిలువెత్తు నిదర్శనమే… మొన్న ఉత్తరాఖండ్, కేరళ ప్రళయం, తమిళనాడు, ఘటనలు. తాజాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. తద్వారా మనకు లభించింది భారీ ఆస్తి, ప్రాణ నష్టమే.
—పట్ట. హరి ప్రసాద్





