Monday - December 23, 2024

సెకండ్ కంటే తక్కువ సమయాన్ని ఏమంటాం…

ప్రస్థుతం మనం సామాన్యంగా కాలాన్ని తక్కువలో తక్కువ సెకండ్లలోనే కొలుస్తాం. ఈ తరం వారికి నిమిషానికి 60 సెకండ్లనే తెలుసు. 60 నిమిషాలు ఓ గంట, 24 గంటలు ఓ రోజుగా లెక్కేస్తాం. ఆ తరువాత 30 రోజులు ఓ నెల, 12 నెలలు సంవత్సరం. అంతే ఇంకా ఎక్కువంటే 10 సంవత్సరాలు ఓ దశాబ్దం, లేదంటే 100 సంవత్సరాలు ఓ శతాబ్దం అని తెలుసు. కానీ ఈ ప్రపంచం సెకండ్లు, నిమిషాలు కనుగొనని రోజుల్లోనే మన పూర్వీకులు కాలమానాన్ని ఎంతో సూక్ష్మంగా కనుగొన్నారు. కానీ మనలో పీ.హెచ్.డీ. చేసిన వారికి కూడా ఆ పూర్వ కాలమానం పూర్తిగా తెలియదంటే అతిశయోక్తికాదు. మనం తెలుగు పత్రికల్లో అప్పుడప్పుడూ తృటిలో తప్పిన ప్రమాదం అని వార్తలు చదువుతుంటాం. అసలు ఈ తృటి అంటే ఏమిటి. ఇప్పుడనుకునే సెకండులో ఎంత భాగం…అసలు మన పూర్వీకుల కాలమాన కొలతలేమిటో తెలుసుకుందాం.

  • కాలమానం సూక్ష్మంగా……

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేషం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)
3 నిమేషాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్టం
12 కష్టాలు = ఒక నిముషం
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు
4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా విభజన చేసిన మన పూర్వీకుల విజ్ఞానాన్ని తెలుసుకుందాం.. భావి తరాలకు తెలుపుదాం..

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates