Monday - December 23, 2024

ఆక్రోశంతో రాబోతున్న అరుణ్ విజయ్

ఆర్‌. విజయ్‌ కుమార్‌ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై అరుణ్‌ విజయ్‌, పల్లక్‌ లల్వాని, కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి నటీ నటులుగా జి.యన్. ఆర్ కుమారవేలన్‌ దర్శకత్వంలో ఆర్‌.విజయకుమార్‌ నిర్మించిన రివేంజ్‌ డ్రామాతో కూడిన  తమిళ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ‘సినం’ చిత్రాన్ని తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, శ్రీమతి జగన్మోహనిల కొలబ్రేషన్ తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాతల సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎమోషన్‌ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంతకుముందు మా బ్యానర్‌లో  మంచి కమర్సియల్ కంటెంట్ తో వచ్చిన ‘ఏనుగు’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌గా తమిళ ‘సినై’ ట్రైలర్ ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామనే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను అన్నారు.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates