హైదరాబాద్, నవంబర్ 24: ఒడ్డెక్కేదాక..ఓడ మల్లయ్య, ఒడ్డెక్కినాంక బోడమల్లయ్య…అన్న సామెతను గుజరాత్ బీజేపీ నేతలు నిజం చేస్తున్నారు. నల్గొండా జిల్లా, దేవరకొండకు చెందిన పసుమర్తి వెంకట సత్యనారాయణ శర్మ (పివీఎస్ శర్మ) ఇన్ అధికారిగా గుజరాత్ సూరత్ లో పనిచేశారు. పదిహేను ఏండ్లు వివిధ హోదాల్లో పనిచేసి, అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి ఎదిగారు. ఉన్నతోద్యోగం కావడంతో అప్పుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పరిచయం ఏర్పడ్డది. ఆయనను ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి రమ్మని మోదీ సలహా ఇచ్చారు. శర్మ మోదీ మాటలు నమ్మారు. ఇన్ అసిస్టెంట్ కమీషనర్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. గుజరాత్ పదిహేనేండ్లు బీజేపీలో పని చేశారు. సూరత్ నగర పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. అయినా ఆయనకి పార్టీలో వేధంపులు తప్పలేదు. తగిన గుర్తింపు రాలేదు. విసిగి వేసారి, పార్టీకి రాజీనామా చేసి గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్ తరపున పోటీ చేస్తున్నారు. సూరత్ మజూరా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గుజరాత్ హోం మంత్రి, బీజేపీ అభ్యర్ధి హర్ష్ సాంఘ్వీ పై పోటీ కి దిగారు.
పీవీఎస్ శర్మ పార్టీకి రాజీనామా చేస్తూ, తాను పార్టీకి ఎంతో సేవ చేసినా, సరియైన గుర్తింపు లభించలేదన్నారు. వేధింపుల వల్ల తాను పార్టీని వీడుతున్నాని పేర్కొన్నారు. మోదీ, పిలుపు మేరకే ఇన్ అధికారి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆయనను నమ్ముకున్న…తనను నట్టేట ముంచారని తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
నమ్ముకున్నోళ్ళకు దేముడు…కేసీఆర్
ఇది ఇలా ఉండగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకుని పలువురు ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలి కదన రంగంలోకి దిగారు. ఆ తరువాత తెలంగాణ వచ్చినంక ఎంతో మందికి తగిన ప్రాధాన్యత నిచ్చి, రాజకీయంగానే కాక, వివిధ రకాలుగా సహాయం చేశారు. ఆ కోవలో ఎమెల్యే , ఎం.ఎమ్మెల్సీ,టికెట్లు,మంత్రి పదవులు, మేధావి వర్గాలకు నామినేటెడ్ పదలు..ఇచ్చారు. ఇలా రాస్తూ పోతే చాంతాడంత ఉంటుంది. కేసీఆర్ నమ్ముకున్నోళ్ళకు దేముడని వారు చెబుతుంటారు.
Monday - December 23, 2024