*తాజా ఎన్నికల ఫలితాల విశ్లేషణ.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అనేది గప్పాలకేనా?
హైదరాబాద్, డిసెంబర్ 11:అత్యధిక సభ్యత్వం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ పార్టీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను విశ్లేషిస్తే..అది అంతా హంబక్కే అని తేలుతున్నదని, రాజకీయ పరిశీలకులు ఆభిప్రాయపడుతున్నారు. 2019 లోనే 18 కోట్ల సభ్యత్వంతో అతి పెద్ద పెద్ద పార్టీ అవతరించిదని బీజేపీ ప్రకటించింది. 2015 కంటే 64 శాతం సభ్యత్వం తమకు పెరిగిందని పార్టీ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల తరువాత తమ విజయాన్ని ఢంకా బజాయించుకుంటూ మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత బీజేపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని ప్రకటించారు. గుజరాత్ విజయాన్ని చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు.…కాని ఒకే సారి మూడు ఎన్నికలు జరుగగా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లలో బీజేపీని ప్రజలు తిరస్కరించిన విషయాన్ని వారు మరచారు. మూడు ఎన్నికల్లో రెండు చోట్ల బీజేపీ ప్రజల మద్దతు కోల్పోయి, అధికారం పీఠం వదులుకోవాల్సి రావడాన్ని బీజేపీ సమర్ధించుకుంటుందో అర్ధం కావటం లేదు.
జాతీయ అధ్యక్షుడైన నడ్డా స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే అధికారాన్ని నిలబెట్టుకోలేక పోవడం బీజేపీ వైఫల్యం కాదా. మరో వైపు దేశ రాజధాని, ఢిల్లీలో గత మూడు టర్మ్ తమ ఆధీనంలో ఉన్న ఎమ్ కోల్పోయిన విషయాన్నీ బీజేపీ నేతలు స్వీకరించాల్సి ఉంది. వచ్చే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, పార్టీ అభ్యర్ధుల తిరుగుబాటును లాంటి తప్పిదాలనుంచి ్త ప్రధాని మోదీ, తన సహచరుడైన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కాపాడాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. కాగా, నడ్డా పదవీ కాలం ముగుస్తున్నవిషయం గమనార్హం. 2017 లో హిమాచల్ లో బీజేపీ గెలిచినా, పార్టీ సీనియర్ నాయకుడైన ప్రేమ్ కుమార్ ధుమాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో , అతన్ని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయలేదు. కాని 2022 లో ఉత్తరాఖండ్ లో సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడ ఎన్నికల్లో ఓడినా అతన్నే మళ్ళీ సీఎం పదవికి ఎంపిక చేశారు.
బీజేపీ లో జవాబుదారీ తనం కంటే విధేయతకే ప్రాధాన్యతనిచ్చే విషయం తెలిసిందే. ఈ రకంగా చూస్తే హిమాచల్ లో బీజేపీ ఓడినా ప్రధాని, అమిత్ షా లకు విధేయుడైన్ల నడ్డా కు.. పార్టీ అధ్యక్ష పదవి ఊడక పోవచ్చు.హిమాచల్ లో కాంగ్రెస్ కు బీజేపీ కి ఓట్ల మధ్య తేడా ఒక శాతమే… కాని గత ఎన్నికలతో(2017) పోలిస్తే హిమాచల్ లో లో బిజేపీకి పడిన ఓట్లు..48.79 శాతం నుంచి 43 శాతానికి తగ్గాయి.
మరో వైపు చారిత్రక విజయమని ఢంకా బజాయిస్తున్న గుజరాత్ ఫలితాలను విశ్లేషిస్తే… ఆమ్ ఆద్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చక పోయి ఉంటే బీజేపీ కి కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చి ఉండేవి. మరో గమనించాల్సిన విషయం ఏమంటే పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం గుజరాత్ లో బలమైన పాటీదార్ వర్గ నాయకుడు, ఖోడల్ధామ్ ట్రస్ట్ ఛైర్మన్ నరేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని కలవడానికి వస్తే అరగంటకు పైగా వేచి ఉండేట్లు చేశారని, ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు నిచ్చేందుకు కొన్ని షరతులు విధిస్తే సరే అన్నాడే తప్ప, తిరిగి అతనికి జవాబు కూడా చెప్పదట. కాని ఆ తరువాత అక్టోబర్ లో ప్రధాని మోదీ, ఆ పాటీదార్ నాయకున్ని పిలిపుంచుకుని మాట్లాడారట. తరువాత ఫలితం తెలిసిందే. రాహుల్ గాందీ, కేజ్రీవాల్ పుణ్యాన గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ, ఆవిషయం మరిచి తమ గొప్పతనమని ఢంకా బజాయించడం విడ్డూరంగా ఉంది. అయితే కొత్తగా 7 కోట్ల మంది సభ్యత్వం తీసుకుని బీజేపీ మరింత ప్రజాదరణ పొందినైట్లెతే, వారు ఎన్నికల్లో బీజేపీకి ఓటెందుకెయ్యలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకి పడ్డ ఓట్లతో సరిచూస్తే ఆ సభ్యత్వాలు నిజమైనవేనా అనే అనుమానం కలుగుతోందని పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. 2019, ఆగస్టులో బీజేపీ సభ్యతం 18 కోట్లకు చేరింతరువాత తమ పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్యం గల పార్టీగా అవతరించిందిన బీజేపీ నేతలు ప్రకటించుకున్నారు. వాస్తవానికి 2015 లోనే బీజేపీ సభ్యత్వం 11 కోట్లు ఉండేదని, అప్పుడే కమ్యూనిస్ట్ పారీ ఆఫ్ చైనా కంటే, తమ పార్టీకి 2.2 కోట్ల ఎక్కు వ సభ్యులున్నారని వారు చెప్పుకున్నారు. ఇదిలా ఉండగా 2019 లోక సభ ఎన్నికల్లో బీజేపీకి 22.90 కోట్ల ఓట్లు రాగా, ఆ ఎన్నికల్లో మోదీని సమర్ధిస్తూ 78 శాతం ఓటర్లు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లతో, దానికి పెరిగిన సభ్యత్వాన్ని పోలిస్తే లెక్క సరిపోవటం లేదు.
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే… 2017 లో బీజేపీకి 18.76 లక్షల ఓట్లు వచ్చాయి. అలాగే లోకసభ ఎన్నికలు తీసుకుంటే 2019 లో ్ల 26.61 లక్షలు మాత్రమే వచ్చాయి. అలాగే 2022 లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి పడిన ఓట్లు 18.14 లక్షలకు తగ్గాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (2022) లో 1.67 కోట్ల ఓట్లు రాగా, 2017 లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లతో పోలిస్తే కేవలం 20 లక్షల్లు మాత్రమే ఎక్కువ. బీజేపీ చెబుతున్నట్లు వారికి దేశ వ్యాప్తంగా 64 శాతం సభ్యత్వ పెరిగితే..బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం చాలా తక్కువనే చెప్పవచ్చు. ఈ రెండు రాష్ర్టాలు..గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ .. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలోచాలా క్రియాశీలకంగానే వ్యవహరించాయని చెప్పొచ్చు. ఈ రాష్ర్టాలలో బీజేపీ అధికారంలో ఉండటంతో అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అయితే అత్యధిక సభ్యత్వం తీసుకున్న మరికొన్ని రాష్ర్టాలలో హర్యానా కూడా ఒకటి. 2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో 21.25 లక్షల ఓట్లు రాగా, 2019 లో లోకసభ ఎన్నికల్లో 73.57 లక్షల ఓట్లు వేశారు. ఇది జాతీయంగా 64 శాతం సభ్యత్వ పెరుగుదల కంటే చాలా ఎక్కువ.