- నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.
- చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.
- మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది.
- జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము…
- మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మనసులో నిలిచిపోయే మంచితనమే గొప్పది.
- కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే…….
- మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.
- నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న….
- మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.
- నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.
- సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.
- పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.
- ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.
- మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .
- ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
- ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
- మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు.
- తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్ధ
- జీవితమొక అందమైన ప్రయాణం
Monday - December 23, 2024