మూడు రంగుల ముచ్చటైన జండాను ఎగరేసి
ముచ్చటగా ప్రజలను మురిపించగానే రాదు స్వాతంత్రం,
ముచ్చటగా మూడు వేళ్ళతో సలాం కొట్టి జాతీయగీతం పాడించగానే రాదు స్వాతంత్రం,
ఎగరేసిన జెండాలోకి తొంగి చూడు ఒక్కసారి నిశితంగా,
కనిపిస్తాయి ఎండిన డొక్కల కడుపులు
నీ దేశంలోని స్వాతంత్య్రానికి చిహ్నంగా,
‘గాంధీజీనే క్యాకియా ?’ అని అరవంగానే రాదు స్వాతంత్య్రం,
‘గాంధీజీనే జాన్ దియా, మై క్యా కీయా?’ అని ప్రశ్నించు ఒక్కసారి అరిచిందానికి జవాబుగా,
జన గణ మన పాడటం కాదు,
భరతజాతిని ఒక్క తాటిపై నడపటానికి ప్రయత్నించు..
నువ్వు కొట్టిన సలాం కు బదులుగా,
సంతలోని చౌకరకం చాక్లెట్లను పదుగురికి పంచగానే రాదు స్వాతంత్రం,
మనిషిలోని మానవత్వాన్ని మంచితనంతో పంచడానికి ప్రయత్నించు ,
పంచిన చాక్లెట్లకు బదులుగా,
తరిమి కొట్టడానికి ప్రయత్నించు స్వాహాతంత్రానాన్ని…
ఈ దేశ సామ్రాజ్యం నుంచి సరిహద్దుల వరకు…
రచన: ఎం.ఎన్. ఎస్. కుమార్.