సూర్యోదయం లోని వెచ్చని వెలుగులా,
లేత భానుడి బంగారు కిరణం లా ,
నీ జీవితంలోని ప్రతి వస్తువు మారాలి అందముగా,
స్ఫూర్తి పొందాలి నీవు బంధు మిత్రుల నుండి,
సంతోషకరమైన వార్తలతో,
ఉత్తేజకరమైన ఊసులతో,
ప్రతి రోజూ గడవాలి ఉల్లాసంగా,
మరచిపోని కావ్యంలా………..
రచన…ఎం.ఎన్. ఎన్. కుమార్.

