మోడువారిన మొక్కకు నీరు పోసావు,
మరోసారి పచ్చగ చేసావు,
మొగ్గలు చిగురింపచేసావు,
పగలే వెన్నెల చూపించావు,
మర యంత్రంలా సాగే జీవితంలో,
మల్లీ మనసు పొరల్ని తట్టిలేపావు,
మరు జన్మే వద్దనుకుంటే,
క్షణమైనా ఆయుశ్శు అమూల్యమైనదేనని నిరూపించావు,
ఆడ వాసనే వద్దనుకుంటే,
మీ అమ్మా, అలీ,చెల్లీ,చెలియా ఆడదేనని గర్తు చేసావు,
మమకారం,అభిమానం, అనురాగం,లాలిత్యం
అన్నింటికి మారు పేరే ఆడతనమని చెప్పావు,
ఆడవారికి అందనంత ఎత్తున ఉండాలన్న
నా ప్రతినను పటాపంచలు చేసావు,
చల్లని గాలి తెమ్మరగా వచ్చావు,
సుతి మెత్తగ స్పర్శించావు,
గుండెను పిండిగ చేసావు,
ఆలోచనల్లో నే అందంగా నిలిచావు, ,
నీ పల కరింపు అరక్షణమైనా చాలనిపించేలా చేసావు,
బంధాలకు బదులు, స్నేహ బంధ ముందని గుర్తుచేసావు,
దేవుడు పంపిన బంధువు అయ్యావు,
కండ్లు మూస్తే ఎక్కడ కనుమరుగైపోతావో
అని కనులే మూయకుండా చేసావు,
కన్నీటికే కమ్మని కథగా మిగిలావు,
కల కాదిది, కధ కాదిది, వ్యధ గా మిగిలే నిజమన్నావు,
నింగిలా అందనంత ఎత్తున నిలబడి నవుతున్నావు,
నాదేముంది నేను నిస్సహాయురాలినన్నావు,
జీవితమనే నాటకం లో నేనూ ఒక పాత్రనన్నావు …
…………..రచనః-ఎం.నాగశేష కుమార్…..