మీరు దూరమౌవుతున్నారన్న నిజం
నన్ను నిలువునా చీలుస్తున్నది,
రోజూ మీ మాటలుండవన్న విషయం
నన్ను మానువును చేస్తున్నది,
మీ మమత మరి లేదన్నది
మనుసుని రాయిని చేస్తున్నది,
హృదయం గాయమైంది,
మనసు మూగబోయింది,
క్షణమొక యుగమైంది,
కాల మొక శాపమైంది,
కాని ఇది నిజం,
మొన్నటి వరకు మన మధ్య దూరం తగ్గించిన కాలం నేటి నుంచి తన
తఢాఖా చూపుతోంది,
అయినా కన్నీరు తో వీడ్కోలిస్తాను,
అవి కన్నీరు కాదు సుమా1
ఆనంద భాష్పాలు,
మీరెంతో అందనంత ఎత్తులో ఉన్నా.
అందు కోవాలన్న కోరిక ఉన్నా,
కాలం కాదంటోంది,
కాని,
నా స్నేహం మిమ్మల్ని బాధ పెడితే,
నా వల్ల మీకు నష్టం జరిగితే,
నన్ను నేను శిక్షించుకుంటానన్న,
నేనిచ్చన మాటను మరిచి పోను,
కాని,
మన స్నేహం పవత్రమైనదని,
మరువబోమన్నది నా నమ్మకం,
వమ్ము చేయరు కదా….
ఎక్కడున్నా…కనబడక పోయినా,
మాట్లాడక పోయినా… మీరు
బాగుండాలని నిండు నూరేళ్ళు ఆయూరారోగ్యాలతో,
అయిదోతనంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా….
తేదిః16-8-2019.