Monday - December 23, 2024

హాయిగా చనిపోవడానికి

మనసుకు నచ్చనిది

మాట్లాడవద్దని,

ఆరు నూరైనా

 ఆచరించవద్దని,

మనసున్న మనిషిలా

 బతకాలనుకున్నా, 

మనసులోని మాటను

 కుండ బద్దలుకొట్టినట్లు

చెప్పలానుకున్నా

మాటను నమ్మాను,

మనిషిని నమ్మాను,

మాట మీద నిలబడ్డాను,

మాటకు కట్టుబడ్డాను,

మనసులోని మాటను

మాట్లాడాను,

తత్ఫలితంగా

 నాడూ…నేడూ…

మానసికాందోళనే

మిగిలింది,

ప్రతి మజిలీ లోనూ

నన్ను ఆడిస్తున్నావు,

 ఆటబొమ్మను చేస్తున్నావు,

ఆ రోజూ…ఈ రోజూ

ఒకే పరిస్ధితి,

రోజులు మారాయి,

మనుషులు మారలేదు.

సమస్యలు మారాయి తప్ప

.మానసికాందోళన ఒకటే,

మనసులో

నేను పడే భాధా ఒకటే,

అవకాశవాదినే అయితే

 ఆ రోజే ఆడి తప్పే వాడిని,

గాడి తప్పేవాడిని,

ఆచి తూచి ఆడుగులేశాను,

ఆదర్శమన్నాను,

నీతి, నిజాయితీ అన్నాను,

అంతా బూటకమన్నారు,

ఆఖరుకు మిగిలినవి,

అసమర్ధుడన్న అవమానాలే…

అయినా నేనెవరికి తలవంచలేదన్న

ఆ ఒక్క తృప్తి చాలు,

హాయిగా చనిపోవడానికి…..

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates