అడగందే అందిస్తావు,
అందలం ఎక్కిస్తావు,
ఆప్తులను చూపిస్తావు,
అంతలోనే కన్నెర్ర చేసావు,
అయినా,
అందుకూ నేనూ సిద్ధమే,
తిరిగి మరో కొద్దిరోజలు
మానసిక ఆంధోళన అనుభవిస్తాను,
అందులోనే ఆనందిస్తాను,
సంతోషిస్తాను, బాధనూ అనుభవిస్తాను,
మనసారా ఆస్వాదిస్తాను,
అయినా … నాడూ –నేడూ-రేపు-
అన్నింటినీ,
నేను నా మనసులోనే
పదిలపరచుకుని,
ఉబికివచ్చే కన్నీటిని
కన్నుల్లోనే ఒడిసి పట్టుకుని,
మనసులోనే రోదిస్తాను,
నీ ఆజ్ఞను శరిసావహిస్తాను,
అయినా…
నేను మనిషినే..
మనుసున్న మనిషినే…
……………….……..రచనః-ఎం.నాగశేష కుమార్…..