హైదరాబాద్, నవంబర్ 20 గుజరాత్ లోని మూడు గ్రామాల ప్రజలు గత మూడేళ్ళుగా డబుల్ ఇంజన్ సర్కారు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనత వైఖరితో పాటు, రాజకీయనాయకులు హామీలు పూర్తి చేయడంలో శ్రధ్ధ చూపక పోవడంతో మూడు గ్రామాల ప్రజలందరూ ఏకమై ఎన్నికలను బహిష్కరించారు. కనీసం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. ప్రస్థుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఓటు వేయబోమని స్పష్టంగా రాజకీయ నాయకులకు చెబుతున్నారు. గుజరాత్ లోని మెహసానా జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఈ మూడు గ్రామాలుంటాయి. దావోల్, దహిసనానా, వారేత గ్రామాల్లో 10 వేల వరకు ఓటర్లుంటారు. అయితే తమ భూములకు సాగునీరు వసతి లేకపోవడం వల్ల ఎన్నో ఏండ్లుగా బంజరు భూములుగా మారిపోయాయని రైతులు మండి పడుతున్నారు. ఇక గ్రామాల్లోని యువకులు మాత్రం ఏదో ఒక పని చూసుకుని పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ పథకాలేవీ తమను ఆదుకోవటం లేదని, మరికొన్ని రోజులు వ్యవసాయాన్ని నమ్ముకుని ఇదే గ్రామాల్లో ఉంటే తాము అర్ధాకలితో చావాల్సి వస్తోందని ఓ నిరుద్యోగి చెప్పారు.
దావోల్ గ్రామానికి చెందిన విద్యాధికుడు జస్వంత్ మాటాడుతూ, ఒకప్పుడు తమ గ్రామంలో రైతులు మూడు పంటలు పండించే వారు. కానీ, కాల క్రమేనా..సాగునీటి కొరత వల్ల వ్యవసాయం భారంగా మారిపోయిందన్నాడు. ఎనిమింది వందల ఫీట్లు తవ్వినా భూగర్భంలో నీరు లభించటం లేదని చెప్పారు. రైతులు కేవంలం పశువల పెంపకంతోనే జీవనం గడపాల్సి వస్తోందని చెప్పారు. యువకులందరూ, వ్యవసాయం విడిచిపెట్టి పట్టణాలకు వలస వళ్ళారన్నారు.
రైతులకు రోజువారీ కూలీకూడా దొరకటం లేదని, నెలకు 10 రోజలు కూడా కూలీ దొరకటం లేదన్నారు.
ఆ మూడు గ్రామాల ప్రతినిధి వాల్జీ మాట్లాడుతూ తాను వ్యవసాయం మానేసి రెండు గేదలు, ఒక ఆవు కొనుక్కుని పాలమ్ముకుని బ్రతుతున్నట్లు చెప్పారు. తమ గ్రామాల్లోని పరిస్థితిని పలు సార్లు సాగునీటి మంత్రికి, ఇతర నాయకులకు చెప్పి విసిగి వేసారామని అన్నారు. ఎవరూ ఏమీ చేయక పోవడంతో 2019 లో ఒక రోజు మూడు గ్రామాలకు చెందిన గ్రామ దేవత ఆలయం వారాహి మాత మందిరంలో సమావేశమై చర్చించుకున్నామని, మూడు గ్రామాల ప్రజలం ఏకగ్రీవంగా ఎన్నికల్లో పాల్గొన వద్దని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లోనూ ఎవరూ నామినేషన్ వేయలేదని చెప్పారు. అలాగే తహసీల్ ప్రతినిధులను ఎన్నుకునేందుకు కూడా ఎవరూ నామినేషన్ వేయలేదని, ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయ బోమని చెప్పారు. అయితే ఏ నాయకుడైనా, అధికారి ఆయినా తమ మూడు గ్రామాల ప్రజలను ఓటు వేయమని అడిగితే..తమ సమస్యలకు పరిష్కారం చూపమని అడుగుతామని అప్పుడే ఓట్లు వేస్తామని చెప్పారు. ఈ మూడు గ్రామాల్లో ఎక్కువగా దళితులు, వెనుకబడిన జాతి వారున్నారు.
Monday - December 23, 2024