Monday - December 23, 2024

అంతరించిపోతున్న భాషలలో ఒకటైన ‘సో’ భాషను రక్షించడానికి ప్రయత్నిస్తున్న జార్ఖండ్ నివాసి 

జార్ఖండ్ లోఅంతరించిపోతున్న భాషలను రక్షించడంలో నిమగ్నమైన యువకుడు ‘హెర్కులస్’
కొత్త తరం యువతీ, యువకులు ఇంగ్లీష్ తప్ప ఇతర భషల పట్ల పెద్దగా ప్రేమ చూపట్లేదు. అంతెందుకు చాలా వరకు ఇంజనీరింగ్, ఎం.బీ.బీ.ఎస్. లాంటి ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్ధులకు వారి వారి మాతృ భాషల పైనే మక్కువ ఉండదు. కనీసం చూసి చదవడమూ సరిగ్గా రాదంటే కూడా అతిశయోక్తి కాదు. అలాంటి ప్రస్తుత తరంలో ఓ యువకుడు, అంతరించిపోతున్న ఆదివాసుల భాషను ముందు తరాలకు అందిచాలని తపన పడుతున్నాడు. ఇది అక్షరాలా నిజం. జార్ఖండ్‌కు చెందిన హెర్క్యులస్ అనే యువకుడు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన కులాలకు చెందిన ఒకటైన “సో” భాషను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనితో పాటు, అతను జార్ఖండ్ యొక్క ‘ముండారి’ భాషను గూగుల్ ట్రాన్స్ లేటర్‌లో చేర్చడంలో నిమగ్నమయ్యాడు.
జార్ఖండ్‌లోని రాంచీ కి సమీప గ్రామం తమర్ లో నివసించే “హెర్క్యులస్ సింగ్ ముండా” ఉగాండాలోని ‘సో’ భాషను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇది ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలలో ఒకటి. ఉగాండా దేశంలో నివసించే ఆదిమ తెగ ‘సో’. వీరి జనాభా మొత్తం 300 మాత్రమే. అందులో 30 మంది మాత్రమే ఈ భాష మాట్లాడతారు. మిగిలిన వారు స్థానిక భాష ”కరంజాంగ్” మాట్లాడతారు. ‘సో’ భాషకు సొంత లిపి కూడా లేదు, కానీ అక్కడి ప్రజలు ఇంగ్లీషు చదివి అర్థం చేసుకుంటారు. దాంతో హెర్క్యులస్ వారి కోసం కేవలం ఇంగ్లీషులోనే 2000 పదాల పుస్తకాన్ని, నిఘంటువును సిద్ధం చేస్తున్నాడు.
బిట్స్ పిలానీ, మెస్రా (రాంచీ) నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, 2018 సంవత్సరంలో, హెర్క్యులస్ గిరిజన సదస్సు ‘సంవాద్’లో పాల్గొనడానికి జంషెడ్‌పూర్ వెళ్లారు. అక్కడ హెర్క్యులస్, ఉగాండా నుండి వచ్చిన ‘సో’ కమ్యూనిటీ అధినేత స్టెఫీని కలిశాడు. ‘సో’ భాష అంతరించిపోవడం గురించి అతని ద్వారా తెలుసుకుని, ఎలాగైనా ఆ భాషను రక్షించాలనుకున్నాడు. లండన్ విశ్వవిద్యాలయంలోని లండన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో ఒక సంవత్సరం పాటు ఫిలాలజీలో మాస్టర్స్ విద్యను అభ్యసించారు. అతను లండన్ విశ్వవిద్యాలయం నుండి గ్రాంట్ కూడా పొందారు. ఆ తర్వాత అతను ఉగాండాలోని ‘సో’ కమ్యూనిటీతో కలిసి రెండు నెలల పాటు నివసించారు. ఇప్పుడు వారి భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

‘సో’ కమ్యూనిటీని రక్షించడానికి ప్రత్యేక ప్రణాళిక
‘సో’ కమ్యూనిటీని రక్షించడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసారు హెర్య్కులస్. ఈ ప్రణాళిక ను స్థానిక ఎంపీ ఆల్బర్ట్ లోక్రు అక్కడి పార్లమెంటులో ప్రవేశ పెట్టి అనుమతి పొందుతారు. అలాగే “సో” భాషా పరిరక్షణకు అవసరమైన నిఘంటువులను, పుస్తకాలను తయారు చేస్తున్నారు. కేజీ తరగతి నుంచే ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి, రాబోయే తరానికి వాటి భాషను, దాని ప్రాముఖ్యతను అర్థం అయ్యేలా భావి తరానికి ఆ భాషను అందించేందుకు చర్యుల తీసుకుంటున్నారు. దీంతోపాటు కమ్యూనిటీ రేడియోను కూడా ప్రారంభింస్తున్నారు. అందులో స్థానిక సమస్యలు, వాటి పరిష్కారాలను ప్రతి శుక్రవారం ప్రసారం చేస్తారు.
“ముండారి” భాషను గూగుల్ ట్రాన్స్ లేటర్‌లో చేర్చబడుతుంది
ఉగాండాతో పాటు, హెర్క్యులస్ జార్ఖండ్‌లోని”ముండారి” భాష కోసం కూడా కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం, గూగుల్ లో సంతాలీ మరియు గౌర్ భాషలలో మాత్రమే అనువాద సౌకర్యం అందుబాటులో ఉంది. ముండారి భాషలోని 20 వేల పదాలను డిజిటలైజ్ చేస్తున్నారు. త్వరలో ముండారీ భాషని కూడా గూగుల్ ట్రాన్స్ లేటర్ లో చేర్చాలని ప్రయత్నిస్తున్నారు.
-ఎం.అభిశేక్ విద్యా

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates