శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ ముద్దం నిర్మించిన బైరాన్ పల్లి చిత్రం చాలా బాగుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కొనియాడారు.సోమవారం నాడు ప్రసాద్ ల్యాబ్ లో బైరాన్ పల్లి చిత్రం ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మామిడి హరికృష్ణ బైరాన్ పల్లి చిత్రాన్ని తిలకించిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బైరాన్ పల్లి చిత్రం అద్భుతంగా వచ్చిందని ఇందులో హర్రర్ సన్నివేశాలు ప్రతిపేక్షకుణ్ణి కట్టిపడేస్తాయని అన్నారు.ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని మంచి వసూళ్లు రాబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బైరాన్ పల్లి చిత్ర నిర్మాత నరేష్ ముద్దం, పలు చిత్రాల నిర్మాత ఆసంపల్లి శ్రీనివాస్ ,సీనియర్ జర్నలిస్టు ,పలు చిత్రాల దర్శకుడు అయిలు రమేష్, నటీనటులు ప్రేమ్ సాగర్, విజయ్ కుమార్ , మంజుష, ప్రభావతి, మాధవి, లోరా ,అప్పాజీ, దామెర రాజేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ చిత్రానికి కెమెరా :డి వై గిరి, సంగీతం:ఎన్ ఎల్ రాజా ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సందీప్,ఎడిటింగ్ మహేంద్ర నాథ్,నిర్మాత:నరేష్ వర్మ , దర్శకత్వం:వెంకట్ కాచర్ల.
Monday - December 23, 2024