Monday - December 23, 2024

బీజేపీకి ఓటు వెయ్యొద్దంటున్న గుజరాత్ డైమండ్ వర్కర్లు

హైదరాబాద్, నవంబర్ 25: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరించాలని డైమండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ గుజరాత్ (డీడబ్ల్యు యూజీ) పిలుపునిచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ కటింగ్ మరియు పాలిషిగ్ పరిశ్రమకు గుజరాత్ లోని సూరత్ కేంద్రంగా విలసిల్లుతున్నది. సూరత్ పాటు సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కార్మికుల అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. బీజేపీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత 12 ఏండ్లుగా డైమండ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా పరిష్కరించలేదని డీడబ్ల్యూయూజీ అధ్యక్షుడు రమేష్ జిలారియా చెప్పారు. ఇప్పుడు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే, ఎప్పుడూ పరిష్కారం కాలేవని అభిప్రాయ పడ్డారు. డైమండ్ వర్కర్ నుంచి వసూలు చేస్తున్న వృత్తి పనును రద్దు చేయాలని గత దశాబ్దకాలంగా డిమాండ్ చేస్తున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. .30 లక్షలకు పైగా డైమండ్ వర్కర్లు, హస్తకళాకారులు ఇబ్బుందులు పడుతున్నారని అన్నారు. కటార్గాం మరియా వరచా జిల్లాల్లో కూడా 4500 ల చిన్న పెద్ద డైమండ్ కర్మాగారాలున్నాయని, కనీసం 6 లక్షల మంది పనిచేస్తున్నారని అన్నారు.
గుజరాత్ లోని డైమండ్ పరిశ్రమలో 92 శాతం మంది సౌరాష్ర్టా పటేల్ వర్గం వారు పనిచేస్తుంటారు. సూరత్ వరచా, కరంజ్, కతర్గాం, కమ్రెజ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాటిదార్ వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. గత ఏడాది పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం ప్రభావం వల్ల సూరత్ మునిసిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన 27 కౌన్సిలర్ల విజయావకాశాలను మెరుగు పర్చాయి. కరోనా సమయంలో డైమండ్ వర్కర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్ధిక సహాయం అందక పోవటంతో ఆ శ్రామిక వర్గం అంతా అసంతృప్తి తో ఉంది. అంతే కాకుండా కరోనా సమయంలో పనులు లేక 16 మంది డైమండ్ వర్కర్లు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో గుజరాత్ డైమండ్ ఎక్స్ ప్రమోషన్ కౌన్సిల్ ( జీపీఈపిసి) 50 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించినా, అది కార్మికులకు అందక పోవడంతో ఆగ్రహంతో ఉన్నారు.
డైమండ్ వర్కర్ల యూనియన్ తన సభ్యులందరికీ వివిధ మాథ్యమాల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వెయ్యవద్దని పిలుపునిచ్చింది. ఉత్తరాల ద్వారా25 వేల మంది, 40 వేల మందికి వాట్సప్ ద్వారా, 80 వేల మందికి ఫేస్ బుక్, టెలిగ్రామ్ గ్రూపులోని 60 వేల మందికి బీజేపి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వెయ్యవద్దని కోరింది. సూరత్ మరియు సౌరాష్ట్రలో డైమండ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే రాజకీయ పార్టీకే ఓటు వేయాలని కోరింది.
గొర్రెల కాపరి సంఘం కూడా…
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్షం చూపుతోందని అందుకే బీజేపీని బహిష్కరించాలని గొర్రెల కాపరుల సంఘం కూడా పిలుపునిచ్చింది. బర్దా , ఎలెచ్ ప్రాంతాల్లో నివసించే గొర్రెల కాపరులకు షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలను, తమ పై పెట్టిన తప్పుడు కేసులు రద్దు చేయాలని ఆ సంఘం ప్రితినిధి నాగోజీభాయ్ దేశాయ్ డిమాండ్ చేశారు

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates