ప్రపంచంలో చాలా సార్లు చాలా రకాలుగా ప్రదర్శనలు చేస్తూ వార్తల్లో ఎక్కుతుంటారు. అది నిరసైనా కావచ్చు. లేక పోతే ప్రజలను తమ వైపు ఆకర్శించడానికి కావచ్చు. ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో విశేషంగా పని చేస్తుంటారు. ఒక్కొసారి రకరకాల దుస్తులు ధరించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరముందేనే సందేశం కోసం విశేషంగా కనిపించిన సంఘటనలు చూసే ఉంటారు. కొన్నిసార్లు కొందరు జుట్టు కత్తిరించి తన నిరసనను వ్యక్తం చేసిన సంధర్భాలూ ఉన్నాయి. కాని ఈ సారి స్కిన్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆస్ట్రేలియన్లు ఏకంగా నగ్నంగా కనిపించి వార్తలకెక్కారు.
ఆస్ట్రేలియన్ బీచ్‌లో దాదాపు 2,500 మంది స్వచ్ఛంధ కార్యకర్తలు నగ్నంగా కన్పించారు. స్కిన్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు వారు పోజులిచ్చారు. ఈ స్వచ్ఛంధ కార్యకర్తలు ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఉదయం సూర్య కాంతిలో చర్మ క్యాన్సర్ గురించి ఒక కళాకృతిని సృష్టించారు. ఆస్ట్రేలియన్లు తమ చర్మాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో అమెరికన్ ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్, నేషనల్ స్కిన్ క్యాన్సర్ యాక్షన్ వీక్ సంధర్భంగా డూయింగ్ థింగ్స్ ప్రాజెక్ట్ ను రూపొందించారు.
“స్కిన్-చెకింగ్ పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని అక అవకాశంగా మార్చుకున్నాను. నా కళ ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వంగా ఉంది ” అని టునిక్ అన్నారు. కళాకృతిలో పాల్గొనేందుకు వాలంటీర్లు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు బీచ్‌లో గుమిగూడారు. స్కిన్ క్యాన్సర్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా ఛారిటీ స్కిన్ చెక్ ఛాంపియన్స్ తో ఆధ్వర్యంలో టునిక్ రా కార్యక్రమం నిర్వహించారు
Monday - December 23, 2024