‘హలో! చునావ్ సే హట్ జావో..మై కుఛ్ నహీ సునూంగా…..’ ఈ మాటలు అన్నది అశామాషీ వ్యక్తి కాదు.. స్వయంగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ రెబల్ నేతకు ఫోన్ చేసి ప్రధాని మోదీ బెదిరించారు. భారత దేశ ఎన్నిక చరిత్రలో ఇలా ఓ ప్రధాని పదవిలో ఉండి, పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్ధిని బెదిరించడం…కనీవినీ ఎరుగలేదు. ఇది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా జిల్లాలోని ఫతేపూర్ శాసన సభకు పోటీ చేస్తున్న అభ్యర్ధి కృపాల్ పర్ కు ఊహించని విధంగా ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి సామాన్యుడు కాడు. స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ. ఫోన్ లో ఎన్నికల బరినుంచి తప్పుకోవాలంటూ హుకం. బుజ్జగింపుతో కూడిన బెదిరింపు అని చెప్పవచ్చు… హలో… చునావ్ సె హట్ జావో.. మై కుచ్ నహీ సునూంగా ( హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో..ఇంక నేనేమీ వినను)అని కృపాల్ పర్ కు హుకుం జారీ చేశారు. దాంతో పర్ తిరిగి సరే నంటూ తల ఊపకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గురించి ఫిర్యాదు చేశారు. నడ్డాజీ నన్ను గత 15 ఏండ్లు అవమాన పరుస్తున్నారు ( నడ్డా….గత్ పంద్రాహ్ సాల్ సే జలీల్ కర్ రహే హై) అనడంతో, ప్రధాని మోదీ..నేను చూసుకుంటాను( మై దేఖ్ లూంగా) అని అంటూ.. ఒకవేళ మీ జీవితంలో నాది ఏమైన పాత్ర ఉందనుకుంటే… పోటీ నుంచి తప్పు కోండి( అగర్.. ఆప్ జిందగీ మే మేరా కోయి రోల్ హై తొ, ఆప్ హట్ జాయ్) అంటూ హుకుం జారీ చేసారు. తరువాత మీ పాత్ర చాలా ఉంది. నేను ఇది భగవంతుని ఆదేశం లా భావిస్తాను( ఆప్ బహుత్ రోల్ హై. మేరే లియే యహ్ భగవాన్ కా ఆదేశ్ హై) అని పరమార్ జవాబిచ్చారు.పరమార్ ఆఖరుకు మోదీ గారు మీరు రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండేది (మోదీజీ ఫోన్ దో దిన్ పహలే హో జాతా తో బెహతర్ హోతా ) అని జవాబిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి స్థాయి నాయకుడు స్వయంగా ఫోన్ చేసి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోమంటే ఎవరు మాత్రం కాదనగలరు. కాదంటే కూడా బతికి బట్టగట్టగలరా…అందునా ఆయన బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడే…కాని ప్రజాస్వామ్యం …రాజ్యాంగం.. అంటూ పలు ఉపదేశాలు చెప్పే బీజేపీ పెద్దలు… హిమాచల్ ప్రదేశ్ లో రెండోసారి ఎన్నికల్లో గెలిచి…అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని అనైతిక మార్గాలు ఎంచుకుంటున్నారో… ఈ ఒక్క ఫోన్ కాల్ ఉదహరణ చాలు.. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ.. అధికారం కోసం అడ్డమైన గడ్డితినడానికైనా తాము సిద్దమని, మరో సారి పిఎంఓ స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తూ అభాసు పాలవుతున్నారు. మొన్నటికి మొన్న…రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నలుగురు ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలతో కొనడానికి ప్రయత్నించి బీజేపీ ఏజెంట్లు రెడ్ హాండెడ్ పట్టు బడ్డారు. ఒక్క మునుగోడులో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి, స్వయంగా ప్రధాని మోదీ, నడ్డాలాంటి దిగ్గజాల ప్రచార సభలు ఏర్పాటు చేసి బొక్క బోర్లా పడ్డారు. అయినా వారికి సిగ్గు రావటం లేదు.
కృపాల్ పర్ మార్ తో పాటు మరికొందరు:
హిమాచల్ ప్రదేశ్ నడ్డా సొంత రాష్ట్రం కావడంతో పాటు… వర్గవిభేదాలు ఎన్నికల వేళ భగ్గు మనడంతో బీజేపీ ఛీఫ్ నడ్డా, రెబల్ అభ్యర్ధులను రంగంనుంచి తప్పించే బాధ్యతను ప్రధాని మోదీకి అప్పగించారు. ఇప్పటికే ఆయన తన హోదా, అధికారంతో పాటు సామ, దాన, దండోపాయాలు ఉపయోగించి అయిదుగురిని రంగంనుంచి తప్పించారు.. ప్రధాని నరేంద్ర మోదీకి కృపాల్ పర్ కు చాలా సన్నిహత సంబంధాలున్నాయి. 2012 లో కృపాల్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా బీజేపీ అతనికి టెకెట్ ఇవ్వ లేదు. మళ్ళీ ఈ సారీ బీజేపీ అతనికి టెకెట్ ఇవ్వలేదు. దాంతో కృపాల్ ఎవరెన్ని చెప్పినా వినకుండా ఫతేపూర్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు. దాంతో బీజేపీ రాష్ట్ర పెద్దలు, 6ఏండ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించారు. హిమాచల్ లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, హిమాచల్ లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి బీజేపీ నాయకులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు.కాగా హిమాచల్ లో ఎన్నికల ప్రచార ర్యాళీ అనంతరం స్వయంగా మోదీ బీజేపీ రాష్ట్ర విభాగంతో సమీక్షించి, రెబల్ అభ్యర్ధులగురించి తెలుసుకున్నారు. ఆ వెంటనే బహిష్కృత నేత కృపాల్ పర్ కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి రంగం నుంచి తప్పించారు. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి బీజేపీ కి చెందిన 21 నియోజక వర్గాల్లో 14 మంది ప్రముఖులు బీజేపీ రెబల్ అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా హిమాచల్ లో తిరిగి అధికారాన్ని పొందడం కోసం బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తున్నదని, స్వతంత్రులను ఎన్నికల బరినుంచి తప్పించడానిక ప్రధాని మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ ఫిర్యాదు చేసింది. అభ్యర్ధులను రంగంనుంచి తప్పించడంతో పాటు పెద్దఎత్తున కాంగ్రెస్ మద్దతుదారులైన ఓటర్ల పేర్లను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఫిర్యాదు లో పేర్కొంది
Monday - December 23, 2024