హైదరాబాద్, నవంబర్ 20:దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లా నీరు అందించిన రాష్ర్టాల సూచికను కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ప్రకటించింది. ఈ నెల నవంబర్ 1 వరకు జరిగిన సర్వే ప్రకారం ఇంటింటికి 100 శాతం నల్లానీరు అందించిన మొదటి 5 రాష్ర్టాలలో తెలంగాణా ఉండగా, ఆ జాబితాలో కిందనుండి అట్టడుగు స్ధానంలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ ప్రారంభించక ముందే మారుమూల పల్లెల్లో కూడా ఇంటింటికి స్వచ్ఛమైన నీరందించాలన్న తెలంగాణ సర్కార్ మిషన్ భగీరధ పథకం ప్రారంభించి అమలు చేసింది. తెలంగాణ సర్కారును చూసి కేంద్రం అమలు చేసిన పలు పథకాలలో ఇంటింటికి నల్లా నీరు కూడా ఒకటి.
Monday - December 23, 2024