తెలంగాణ రైతులకు అందని ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ రైతులను ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగుమతులపైనే ఉత్సాహం చూపిస్తోంది. గత ఏడాది కేంద్రం వరి కొనుగోలు నిరాకరించడంతో, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి, రైతులను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల వల్ల వరి పంట దిగుమతి పెరిగింది. అయితే వంటనూనెల డిమాండ్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ రైతులకు పలు సబ్సిడీలు అందించి పామాయిల్ రైతులను ప్రోత్సహిస్తున్నది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దాంతో మోదీ నాయకత్వం లోని బీజేపీ విపక్షాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి పదిహేను రోజులకోసారి కేంద్రం వంటనూనెలు, బంగారం మరియు వెండిల బేస్ దిగుమతి ధరలను సమీక్షిస్తూ ఉంటుంది. విమర్షల నేపధ్యంలో ఎట్టకేలకు చాలా కాలం తరువాత కేంద్రం పామాయిల్ దిగుమతి సుంకాలను 6నుంచి 11 శాతానికి పెంచింది. ఇటీవల అంతర్జాతీయంగా ఎదురైన ఇబ్బందులు, ఉక్రెయిన్ యుద్దం తదిర కారణాల వల్ల వంటనూనెల ధరలు దిగుమతి ధరలు మరింత పెరిగాయి.
రాష్ట్రంలో వరి దిగుబడి పెరగడంతో పాటు , జార్ఖండ్,తమిళనాడు మరియు కేరళ రాష్ర్టాలు వరి డిమాండ్ తగ్గింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పాం రైతులను ప్రోత్సహించడానకి పలు చర్యలు తీసుకున్నది. ఉదారంగా సబ్సిడీలతో పాటు ఈ ఏడాది ఆయిల్ పాం సాగు ప్రోత్సకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయిల్ పాం సాగు విస్తీర్ణం మరో రెండు మిలియన్ ఎకరాలు పెరగాలని వ్యవసాయ విభాగానికి లక్షం నిర్ధారించారు. 2014 లో పామాయిల్ సాగు భూమి 34 వేల ఎకరాలుండగా, ఈ ఏడాది, 2022 లో పామాయిల్ సాగు భూమి విస్తీర్ణం 72 వేల ఎకరాలకు పెరిగింది. అలాగే రానున్న నాలుగు ఏండ్ల లో ఆయిల్ ఫాం రైతుల సంఖ్య 6500 నుంచి 35000 కు పెంచాలని ప్రణాళికలు తయారయ్యాయి. తెలంగాణ ను ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆయిల్ పామ్ సాగుదారుగా అవతరించడానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి చెప్పారు. మలేషియా మరియు ఇండోనేషియా నుంచి వస్తున్న వంటనూనెల దిగుమతుల్లో 30-40 శాతం తగ్గించే విధంగా రాష్ట్రంలో పామాయిల్ సాగును పెంచేట్లు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. కాగా దేశంలో వంటనూనెల వడకంలో 60 శాతం పామాయిల్ ఉపయోగిస్తున్నారు. మనదేశంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుండగా, అది 2.7 శాతం మాత్రమే. ఇండోనేషియా మరియు మలేషియా నుండి 10 మిలియన్ మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుమతి జరుగుతుండగా, అది సుమారు 90 శాతానికి సమానం
Monday - December 23, 2024