ఓటర్లుగా ముద్దు.. అభ్యర్ధులుగా వద్దు!
-గుజరాత్‌లో ముస్లింల పట్ల బీజేపీ తీరిది
-61% ముస్లింలున్న చోట కూడా ‘నో’ టికెట్
– 9% ఓట్లున్న గుజరాత్‌లో ముస్లిం
మైనారిటీలకు దక్కని ప్రాధాన్యం
‘హిందూ’ అన్నది ఒక జీవన విధానమే కాని, తాము మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం లేదని, ముస్లింలకూ తమ పార్టీ సమప్రాధాన్యమిస్తున్నదని వాదించే బీజేపీ నిజరూపం మరోసారి గుజరాత్ ఎన్నికల్లో బయటపడ్డది. మత ప్రాతిపాదికన తామెప్పుడూ రాజకీయాలు చేయటం లేదని వాదిస్తూ, బహుసంఖ్యాకుల అభిప్రాయాలను గౌరవించాలన్నదే తమ సిద్ధాంతమని బీజేపీ నేతలు గప్పాలు కొడుతుంటారు. అయితే, గుజరాత్‌లోని బహుసంఖ్యాకులుగా ఉన్న ముస్లిం ప్రభావిత నియోజక వర్గాల్లో కూడా బీజేపీ వారికి రాజకీయ ప్రాధాన్యమివ్వట్లేదు. వారి జనాభా సంఖ్య 61% ఉన్న అసెంబ్లీ నియోజక వర్గంలోనూ బీజేపీ ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించక పోగా, రాష్ట్రవ్యాప్తంగా ఒక్క టికెట్టు కూడా ముస్లిం వర్గాల వారికి ఇవ్వక పోవడం చర్చనీయంశంగా మారింది. అలాగే తామేమీ తక్కువ తినలేదని ముక్కుతూ మూలుగుతూ కేవలం ఆరుగురు ముస్లింలకు కాంగ్రెస్ టికెటిచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేవలం ముగ్గురు ముస్లింలను అభ్యర్ధులగా ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం జనాభా 9 శాతంగా ఉండగా.. 26 శాతం నుంచి 61 శాతం వరకు ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పది దాకా ఉన్నాయి. 24 ఏండ్ల కిందట ఒకేఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చిన కమలదళం.. ఆ తర్వాత ఎన్నడూ ఆవర్గం అభ్యర్థిని బరిలో నిలుపలేదు.
గుజరాత్‌లో ముస్లిం ఓటర్లు ఇలా..
నియోజకవర్గం పేరు ఓటర్లు
జమాల్‌పుర్-ఖాడియా 61%
దానీలిమ్‌డా 48%
దరియాపుర్ 46%
వాగ్‌రా 44%
భరూచ్ 38%
వేజల్‌పుర్ 35%
భుజ్ 35%
జంబూసర్ 31%
బాపూ నగర్ 28%
లింబాయత్ 26%
————————————————————
ముస్లింలకు ఏ పార్టీ.. ఎన్ని టికెట్లు?
పార్టీ మొత్తం అభ్యర్ధులు ముస్లిం అభ్యర్ధులు
బీజేపీ 166 0
కాంగ్రెస్ 140 6
ఆప్ 157 3
ఏఐఎంఎం 5 4
———————————————–
Monday - December 23, 2024