Monday - December 23, 2024

నెత్తుటి గడప – రెండోసారి

(HORROR STORY)

“ఇంకెంత టైంలో మన కొత్తింటికి చేరుకుంటామండీ…?”

ప్రశ్నార్థకరంగా అడిగింది రాజీ ఎంతో సంబంరంగా..

“రమారమిగా పది నిమిషాలు పట్టొచ్చు” కారు . డ్రైవ్ చేస్తూ బదులిచ్చాడు విశాల్. “ఏమండీ! మీరు ఏమీ అనుకోనంటే ఒకటి

చెప్తాను. మీకివన్నీ నప్పవని తెలుసు.. కానీ” అని సంశయిస్తూ రాజీ అంటుండగా… “ఏందో సూటిగా చెప్పు. నేనేమనుకోనులే” అని భరోసా ఇచ్చాడు. విశాల్.

ఆ మాటతో ధైర్యం చేసి రాజీ అంది కదా “కౌ త్తింటికి వెళ్తున్నాం. ఎంతమంది కళ్ళుపడి దిష్టి తగి లిందో ఆ ఇంటికి! గ్రామ దేవతల మొక్కుగా ఏదైనా బలిస్తే” అన పూర్తి చేసేలోపే… విశాల్ ముఖం కంద గడ్డలా మారడం చూసి ఊరుకుంది రాజీ..

విశాల్ జన్యుశాస్త్రవేత్త. దేవుడు, దెయ్యాలు ఇవేమీ సమ్మడు. ఎవరైనా వాటి పేరుతో ఏవైనా కార్యాలు చేసినా సహించడు. పది నిమిషాల్లో కొత్తింటికి చేరుకున్న నవ దంపతులు తెరచి ఉన్న ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే- గడపలోని నెత్తుటి మరకలను చూసి అవాక్కయ్యారు.

“అయ్యో! ఏంటండీ? నాకేదో భయంగా ఉంది. నేను చెప్తే విన్నారు కాదు. ఈ ఇంటికి ఏవో దుష్ట పిశాచాలు పట్టినట్లున్నాయి. శాంతి చేయించాలి” అని గుక్క తిప్పుకోకుండా అంది రాజీ, ఎంతో ఆవేశంగా.

విశాల్ మాత్రం తీక్షణంగా “ఇదేదో హత్యలా ఉంది. తలుపుపై ఉన్న ఈ హస్త ముద్రను చూస్తే…. హంతకుడికి, బాధితుడికి మధ్య పెనుగులాట జరిగి..”ఇంకా ఏదో చెప్పబోయాడు.

“మీరూరుకోండి. ఇదంతా ఏదో క్షుద్రశక్తుల పనే..” అని కోపంగా అరిచింది రాజీ.

విశాల్ మాత్రం వ్యంగ్యంగా “దెయ్యం పనైతే గదిలోపల ఇంత చీకటిగా ఉంది. చంపిన బాడీని

లోపలి చీకట్లోకి మీ దెయ్యం గారు లాక్కుపోవ చ్చుగా బయటికి ఎందుకు ఈడ్చుకుపోయినట్లో? అంటే దెయ్యాలు అవుట్ డోర్ లో కూడా డ్యూటీ చేస్తాయన్నమాట.” అంటూ నవ్వుతున్నాడో లేదో….

వెనగ్గా ఏదో శబ్దం అయితే అటు తిరిగి చూసే లోపే ఇనుప చువ్వల్లాంటి చేతులు విశాల్ మెడను సలిపాయి. కంఠంలో ప్రాణం గుడ్లల్లోకొచ్చింది. ఆ హఠాత్పరిణామానికి రాజీ స్పృహ కోల్పోయింది.

ఒక్కసారిగా గదంతా కరతాళ ధ్వనులతో

మార్మోగిపోయింది. మంచి షార్ట్ఫిల్మ్ తీశానని అందరూ నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ ఊపుతో నేనుండే రూంకి బయలుదేరి డోర్ తెరి చాసు. గడపలో నెత్తురు, తలుపుపై చేతి అచ్చు. హఠాత్తుగా వెనుక ఏదో చప్పుడు. వెనక్కి తిరిగే లోపలే భయంతో స్పృహ కోల్పోయా.

కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్పై నా ముందు నా ఫ్రెండ్స్… పశ్చాత్తాపంతో… సారీ చెబుతూ…(నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, బతుకమ్మ ఆదివారం సంచికలొ నూరు రూపాయల మొదటి బహుమతి పొందిన కథ)

| కె. రాజశేఖర్, న్యూబోయిగూడ, సికందరాబాద్(రచయిత సీనియర్ జర్నలిస్ట్)
72072 06174

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates