Monday - December 23, 2024

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

  • నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.
  • చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.
  • మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది.
  • జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము…
  • మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మనసులో నిలిచిపోయే మంచితనమే గొప్పది.
  • కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే…….
  • మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.
  • నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న….
  • మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.
  • నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.
  • సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.
  • పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.
  • ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.
  • మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .
  • ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
  • ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
  • మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు.
  • తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్ధ
  • జీవితమొక అందమైన ప్రయాణం

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates