నీ ప్రతి తలపులో నా పేరే ఉందన్నావు,
నే చెంత లేకపోయినా నా రూపును హృదయంలో కలిగి ఉంటానన్నావు,
రోజులు గడిచినా,
యుగాలు మారినా,
మరువలేను మన మైత్రి నన్నావు,
నా గుర్తుగా నీ వారసునికి నా పేరే పెట్టుకుంటానన్నావు,
నిజమేనా?
మరువవుగా ఈ స్మృతులను
మాట తప్పితే నీ రక్తం రంగు ఎరుపు కాదు నలుపుగా మిగిలిపోతుంది , మరిచిపోకు సుమా!
రచన: ఎం.ఎన్. ఎస్.కుమార్.