Monday - December 23, 2024

ఎన్ని’కల’లు

ఎన్నికలొచ్చాయ్,
ఎన్నికలొచ్చాయ్,
ఎన్ని’కల’ల
సంబరాలు తెచ్చాయి,
సీట్ల కొసం తప్పవీ
పైరవీల పాట్లు
ప్రజాసేవ పేరుతో
అధికార దాసులు
వచ్చేనా? అని తెరగా
ధనరాసులు,
ఆడుతున్నారు ఈ రేసులు,
గెలుపు నాదేనని
పెడుతున్నారు ఫేసులు
ఇదే అదనుగా
కొట్టేస్తున్నారు
ఫిరాయింపు చాన్సులు
పుట్టుకొస్తున్నారు
వీధికో ‘కాన్షిరామ్’ లు
నిర్ణయించనున్నాయి
బ్యాలెట్ బాక్సులు
మార్చనున్నాయి లక్మీ, నర సింహ,హరి,చంద్రుల తలరాతలు.
రచన: ఎం.ఎన్. ఎస్.కుమార్. (96 ఎన్నికలప్పుడు)

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates