నేస్తం,
నేను నీ చెంత లేకున్నా,
నీవు నాకు కనబడకున్నా
నిన్ను మాత్రం మారువలెకున్నా,
నిన్నటి వరకు నా స్నేహం
నీకు అవసరం అనుకున్నా,
నేడు ఇక నా అవసరం తీరిందనుకుంటున్నా,
నా నైతిక బాధ్యత తీర్చానని అనుకుంటున్నా,
నేస్తం!
రాలేదని నిరాశ పడకు,
మొన్నటి నిరాశ,
నిన్నటి నిరాసక్తి,
లేవిప్పుడు నీ కన్నుల్లో,
నిండింది నీ హృదయం సంతోషంతో,
వచ్చింది నీకు ధైర్యం,
కలిగింది నీకు జీవితంపై నమ్మకం,
నీ రాకున్నా,
నే కనబడకున్నా,
నీ హృదయంలో
నా స్తానం నాకే మిగల్చవా?
కోరుకోను నిన్నెడూ,
ఇంతకన్నఇంకెన్నడూ,
మన స్నేహానికి ప్రతిరూపంగా,
నేస్తం!
మరువలేను నిన్ను
ఈ జీవిత కాలం.
రచన..ఎం.ఎం.ఎస్.కుమార్.