Monday - December 23, 2024

స్కాలర్షిప్ నిలుపుతో దళిత విద్యార్ధులు పరేషాన్

హైదరాబాద్, డిసెంబర్ 18 : సబ్ సాథ్, సబ్ కా వికాస్ అనే నినాదంతో అన్ని వర్గాల అభివృధ్ధికి కృషిచేస్తున్నామని డాంబికాలు పలికే బీజేపీ నేతల మాటలు, ఆచరణకు ఆమడ దూరంగా ఉన్నాయని మరోసారి నిరూపితమవుతున్నాయి. యూపీ లోని యోగీ సర్కారు గత ఏడాదిగా దళిత విద్యార్ధులకిచ్చే స్కాలర్ షిప్ నిలుపుదల చేయడంతో వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. లక్నో లోని బాబాసాహెబ్ భీమ్ అంబేద్కర్ యూనివర్సిటీ ( బిబిఎయు) లో ఇంజనీరింగ్ చదువుతున్న పేద దళిత విద్యార్ధులు స్కాలర్ జారీకాక, ట్యూషన్ ఫీజులు చెల్లించక పోవడంతో, యూనివర్షిటీ అధికారులు పరీక్షలకు అనుమతించటం లేదు. దాంతో విద్యార్ధులు యోగీ ప్రభుత్వం పై మండి పడుతున్నారు. ఏడాదికి కుటుంబ ఆదాయం రు. 2 లక్షలకు మించని దళిత విద్యార్ధులకు సంక్షేమ శాఖ నుంచి ఏడాదికి రూ. 80 వేలు స్కాలర్ షిప్ లభిస్తాయి. కాని గత ఏడాదిగా ప్రభుత్వం స్కాలర్ షిప్ చెల్లించక పోవడంతో ఇంజనీరింగ్ తోపాటు ఇతర కోర్సుల విద్యార్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం విద్యార్ధి నాయకులు గత అక్టోబర్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్ దృష్టికి తీసుకు వచ్చి, వినతి పత్రాలిచ్చిన ఫలితం లేకుండా పోయింది. అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం మాకు స్కాలర్ పనిలేదు, ట్యూషన్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతినిస్తామని మెలిక పెట్టడంతో దళిత విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు.
ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ర:
ఎస్సీఎస్టీ వర్గాలలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన స్కాలర్ షిప్ జారీ చేయకుండా ఆలస్యం చేయడం ఉద్దేశ్యపూర్వకమే. బీజేపీ ప్రభుత్వం దళిత వర్గాలను అణిచివేయాలని కుట్ర పూరితంగానే స్కాలర్ షిప్ జారీ చేయటంలేదు.
-ఎస్.ఎఫ్.ఐ. విద్యార్ధి నాయకుడు.
మానాన్న రోజువారీ కూలీ పనులకు వెళ్తాడు.మా కుటంబ ఆదాయం ఏడాదికి రూ.50 వేలకు మించదు. నేను ప్రభుత్వం ఎస్.సి, ఎస్. టీ. విద్యార్ధులకిచ్చే స్కాలర్ షిప్ ఆధారంగానే ఇంజనీరింగ్ చదువుతున్నాను. అడ్మిషన్ కూడా ఆ ప్రాతిపాదికనే జరిగింది. కాని గత ఏడాదిగా ప్రభుత్వం స్కాలర్ షిప్ నిలిపివేసిన కారణంగా తాము చదువును అర్ధాంతరంగా ఆపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సెమిస్టర్ ఫీజు బకాయిలతో పాటు ఈ సెమిస్టర్ ఫీజునూ చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతినిస్తామని యూనివర్సిటీ అధికారులు నోటీసులు పెట్టారు. ఒకే సారి లక్షా ఇరువై వేలు ఎక్కడినుంచి తీసుకురాగలగుతాను. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది
…..రాజు, ఇంజినీయరింగ్ విద్యార్ధి
నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. యూనివర్శిటీ అధికారులు ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే పరీక్షకు అనుమతించమని ముందుగానే చెబితే కనీసం పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. స్కాలర్ షిప్ ఏడాదికి లక్ష నుండి లక్షా 25 వేల రూపాలయలు వస్తాయి. దానిపై ఆశతోనే చాలా మంది దళిత విద్యార్ధులు ఇంజనీరింగ్ చదవుతున్నారు.స్కాలర్ ఆధారంగానే అడ్మిషన్ పొందే తాము ఇపుడు అంత మొత్తాన్ని ఎక్కడినుంచి తెస్తాం? గతంలో కూడా నిరసనలు తెలిపాము. యూనివర్సిటీ రిజిస్ట్రార్ , అధికారులు మా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి స్కాలర్ వచ్చేట్లు చర్యులు తీసుకుంటామనుకున్నాం. కానీ మా దళిత విద్యార్ధుల కష్టాలు ఎవరూ పట్టించుకోలేదు.
సచిన్ కుమార్ సింగ్, ఇంజనీరింగ్ విద్యార్ధి.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates