ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని…నాకేమవుతావని …
నువ్వు నా గుండె సవ్వడివని,
నా జీవన గీతానివని, సంగీతానివని,
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వే జీవితమని, నువ్వే నా బ్రతుకని,
నువ్వే నా వెలుతురువని, నువ్వే నా చీకటివని,
నువ్వు లేనిదే, నీ తలపు రానిదే, నాకు రోజే లేదని,
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి…
నువ్వెవరని, నా కేమవుతావని….
నా కళ్ళలో నువ్వే, నా కన్నీళ్ళలో నువ్వే,
నా తలపుల్లో నువ్వే, నిద్రలో నువ్వే,
కలల్లో నువ్వే…. ఆఖరుకు నా ఊపిరిలో కూడా నువ్వే…
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని…నాకేమవుతావని …
నువు కన్పిస్తే చూస్తూ ఉండిపోతానని,
నువు మాట్లాడితే వింటూ మైమరిచి పోతానని,
కళ్ళు మూసుకున్నా నువ్వే, కళ్ళ తెరిచినా నువ్వే,
నా ఆలోచనల్లో నువ్వే, ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని, నాకేమవుతావని …
నా ప్రతి పగలు, ప్రతి రాత్రి లో నువ్వే,
ప్రతి ఉదయం నువ్వే, సాయంత్రం నువ్వే,
ప్రతి పనిలో నువ్వే, , నా ప్రతి మాటలో నువ్వే,
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని…నాకేమవుతావని …
ప్రతి జ్ఞాపకం లో నువ్వే, ప్రతి ఊసులో నువ్వే,
ప్రతి నవ్వులో నువ్వే, ప్రతి ఏడుపులో నువ్వే,
సంతోషంలో నువ్వే, బాధ లో నువ్వే,
ఆవేదన లో నువ్వే, ఆనందంలో నువ్వే..
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని…నాకేమవుతావని …..
ఎక్కడి కెల్లినా నువ్వే,
ఎక్కడ చూసినా నువ్వే,
ప్రతి చోట నువ్వే,
తూర్పున నువ్వు, పడమర న నువ్వు,
ఉత్తరాన నువ్వు, దక్షిణాన నువ్వు,
నా వెంటే నువ్వు, నా నీడలా నువ్వు,
ఎలా చెప్పాలి, నీ కెలా చెప్పాలి,
నువ్వు లేకపోతే నేనే లేనని,
నువ్వెవరని…నాకేమవుతావని …..
నీ రూపమొక స్ఫురద్రూపం, మధర జ్ఞాపకం,
నీ ఆత్మీయ పలకరింపులు, చిరునవ్వుల చిందించే పెదవులు,
నీ ముఖాన గాలికెగిరే ముంగురులు,
భాష కందని భావాలు చెప్పే నీ కన్నులు,
అయినా వణుకు తెప్పిస్తాయి నీ చూపులు,
అన్నీ కలగలిపితే నీ సొగసు చూడతరమా…
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నువ్వెవరని…నాకేమవుతావని …..
ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి….
నాకు అందనంత ఎత్తులో ఉన్న ఆకాశమూ నువ్వే,
అపారమైన సహనమున్న భూమీ నువ్వే,
ఈదలేనంత సముద్రమన్నా నువ్వే,
చేరుకోవాలనుకున్న తీరమన్నా నువ్వే,
అన్వేషణ నువ్వే, మార్గమూ నువ్వే, గమ్యమూ నువ్వే
నా నేస్తానివీ నువ్వే , నా ప్రేయసివి నువ్వే,
అదృష్టానివీ నువ్వే, నన్ను కదిలించిన దేవతవూ నువ్వే,నాకు మరో జన్మనిచ్చిన అమ్మవూ నువ్వే,
ఆఖరకు నా ప్రాణమూ నువ్వే అని,
ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి,
ఏమని చెప్పాలి, నువ్వెవరని, నాకేమవుతావని …..
…………..రచనః-ఎం.నాగశేష కుమార్…..