ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఇంకా మరువలేదు.. ఇంకా కండ్ల ముందునే కదలాడుతోంది… 100కు పైగా ప్రాణాలు కోల్పోయారు… ఈ పరిస్థితి నుంచి తేరుకోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని జహానాబాద్ జిల్లాలోని ముఖౌడం పూర్ లో బాబా సిద్ధనాథ్ ఆలయం దగ్గర మళ్ళీ తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారు 20 మందికి తీవ్ర గాయాలు అవడం బాధాకరమైన విషయం. ఇది అధికారికంగా వచ్చిన సమాచారం.
శ్రావణమాసం సందర్భంగా సిద్ధ నాథ్ ఆలయంలో నిర్వహించిన వేడుకకు భారీగా భక్తులు వచ్చారు ఈ క్రమంలో అందర్నీ అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీయడంతో ఘటన జరిగినట్లు చెబుతున్నారు. అయితే పూల దుకాణంలో భక్తులకి వ్యాపారస్తులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం వల్లే తొక్కిసలాటకు కారణమైందంటూ ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు.
మన దేశంలో దైవానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆలయాలు దగ్గర ప్రముఖుల ప్రసంగాలు ఇస్తున్నప్పుడు భారతీయ సనాతనంగ వస్తున్న సాంప్రదాయంలో భాగంగా వారి ప్రవచనాలను వినేందుకు వస్తారు. ప్రత్యేక రోజుల్లో అయితే మరింత మంది భక్తులు కిక్కిరిసిపోయేలా ప్రవచనాలకోసమే కాకుండా, వారిని దర్శించి ఆశీస్సులు తీసుకుంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో భారీగా తరలి వస్తారు. దాంతో అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవచ్చు. లేదా వారు కల్పించలేకపోవచ్చు. ఆ పరిస్థితులే ఆ యా సంఘటనలకు కారణం కావచ్చు.
బాబాలు, గురువులు, మత బోధకులు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు పరిమితిని ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని దేవాలయాలు పేరుగాంచి ఉండడం వల్ల అక్కడే సభలు, సమావేశాలు పెట్టాలని ఉద్దేశంతో మత గురువులు, బాబాలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. మిగతా రోజుల్లో మిగతా ప్రాంతాలలో ఈ అవకాశం ఉంటుందో లేదో అనేది, భక్తులకు తెలియదు. కాబట్టి, ఒకసారైనా వారి ప్రవచనాలను వినాలనే తాపత్రయంతో ఎక్కువ మంది భక్తులు వచ్చే పరిస్థితి ఉంటుంది. సభలు సమావేశాలు, ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్న రోజు అక్కడ పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. ఎంతమంది అక్కడికి వస్తే కనీస సౌకర్యాలు ఏర్పాటుగలమో, లేదో చూసుకోవలసిన అవసరం ప్రవచనాలు చెప్పే బాబాలు, గురువులతో పాటు ఆలయ సిబ్బంది, అధికారులకు ఎంతైనా ఉంది.
శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక రోజు కాబట్టి అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అధికారులు ఆలయ సిబ్బంది లోపాలు కనబడుతున్నాయని నిపుణులు, మేధావులు అంటున్నారు. సిద్దనాద్ ఆలయం దగ్గర సమావేశం పెట్టినప్పుడు అదుపు చేసే పరిస్థితికి మించి జనాలు వచ్చే పరిస్థితిని తీసుకు రావడం నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపం కారణమని అంటున్నారు. హత్రాస్ ఘటన జరిగిన తరువాత కూడా తీసుకోవాల్సిన చర్యలు సిద్ధ నాథ్ ఆలయం దగ్గర సమావేశానికి ఏమాత్రం తీసుకోలేదని మేధావులు, నిపుణులు, భక్తుల బాధితులు మండిపడుతున్నారు.
దేశంలో ఇలాంటి భక్తి ప్రవచనాలు జరుగుతున్న సమావేశాల్లో ప్రాణాల పోతుండడం ఏ మాత్రం స్వీకారయోగ్యం కాదు. బాబాలు, గురువులు గ, ప్రవచనాలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే, కచ్చితంగా ఆయా ప్రాంతంలోని పరిస్థితులు, పకృతికి సంబంధించిన విషయాలు, అక్కడున్న ఆలయ పరిస్థితిపై అధికారులతో సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలను పగడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత గురువులు, బాబాలకు ఎంతైనా ఉంది.వారు దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమాల షెడ్యూల్ ముందుగానే తెలియజేస్తే పర్వాలేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు వస్తారనే భావన భక్తుల్లో ఉంటుంది. కాబట్టి కొంతమేర భక్తుల సంఖ్య కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడ అలా చేయడం లేదు. స్పెషల్ రోజునే ఆ ఆలయానికి అధిక ఆదాయం వచ్చేలా దేవాలయ ప్రాంగణంలోనే పెట్టడంతో… భక్తుల రద్దీ చూడక తప్పడం లేదు. ఏ ప్రవచనాలైనా, ఏ దైవ సూత్రాలైన విని అనుభూతిని పొందాలి అనే లక్ష్యంతోనే భక్తులు ఉంటారు. అలాంటి ప్రవచనాలు వినాలని కూడా ఆశిస్తారు. బాబాలు అక్కడ భక్తులకు పరిమితం చేసి… మళ్లీ వేరు, వేరు ప్రాంతాలకు మేము వచ్చి భక్తి ప్రవచనాలను తెలియజేస్తామనే విషయాన్ని భక్తులకి పలుమార్లు తెలియజేస్తూ ఉంటే… కొంతమంది ఆ ప్రవచనాలకు, ఆ స్పెషల్ రోజున పెట్టే సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రమాదమూ దూరమయ్యేది.
సభకు ఎంత మంది భక్తులు వస్తారని అంచినాను బట్టి ప్రోగ్రామ్స్ ఉండాలి భక్తులను అదుపు చేసే పనిలో ఆలయ సిబ్బంది మాత్రమే కాదు ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నాలు చేయాలి. దైవసభలు సమావేశాలకు పర్మిషన్ ఇచ్చే విషయంలో పగడ్బందీగా వ్యవహరించాలి. పరిమిత సంఖ్య ఉండేలా చూడాలి, కానీ, ఇక్కడ అలా ఉండడం లేదు భక్తుల నుంచి వసూలు చేసే పైసల మీద మాత్రమే దృష్టి సాధిస్తున్నారు ఆలయానికి వచ్చే ఆదాయం పైన మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత ఎక్కువ మంది భక్తులు వస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు…
ప్రవచనాలు దైవ కార్యక్రమాలు చేస్తే ఆలయ సిబ్బంది, అధికారుల పాత్ర ఎంతో కీలకం ఇరువురిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించిన ప్రమాదానికి అధికారులు సిబ్బంది కారణమా ఒక తప్పదు. ఆదాయం మీద దృష్టిని తగ్గించి ఏ ఆలయం దగ్గరైనా దైవ కార్యక్రమాలు చేస్తే అక్కడ అనుకూలంగా లేకపోతే అధికారులు పర్మిషన్ ఇవ్వకూడదు. అక్కడ నిర్వాహకుల లోపాలపై పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఘటనకు కారణమైన వారిని భాగస్వాములు చేయాలి.
పరిమిత భక్తుల సంఖ్య మించిపోతే ప్రసార సాధనాలు ద్వారా వీక్షించే సదుపాయం కల్పించడం, మరోసారి సమావేశం ఏర్పాటు చేసేలా చేస్తే ఇలాంటి ప్రమాద ఘటన నుంచి బయట పడొచ్చు. జరిగిన ప్రమాదం పై ఆలస్యం చేయకుండా పూర్తి విచారణ జరిపి, లోపాలను సమీక్షించి బాధ్యులపై కఠిన శిక్షలు తీసుకోవాలి. అప్పుడే కొంతవరకు సమావేశాలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొంతమేర ప్రాణ నష్టాన్ని తగ్గించగాల్గుతాం.
==== పట్ట. హరి ప్రసాద్ ,జర్నలిస్ట్, 8790843009



