పండగ రోజుల్లో మనం అందరం కొత్త బట్టలేసుకుంటాం. కాని అమ్మాయిలు (ఆడవాళ్ళు) మాత్రం బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. నిజంగా ఎవరిని చూసినా పండగ రోజుల్లో సంతోషంగా ఉంటారు. కొత్త బట్టల్లో బంగారు ఆభరణాలల్లో, ఇంకా అందంగా కనిపిస్తుంటారు. ఆ బట్టలు, బంగారు ఆభరణాలు తీసేస్తే వారు మళ్ళీ మామూలుగానే కనిపిస్తారు. సక్సెస్ కు మరో ముఖ్యమైంది…చిరునవ్వు… మనం సహజంగా నవ్వుతూ కనిపించే వారికి, నవ్వుతూ పలకరించి మాట్లాడుతూ ఉండే మనుషులకు ఎక్కువ మంది స్నేహితులు ఉండటాన్ని గమనిస్తుంటాం. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా…నిరాశ, నిస్పహలతో కనిపించే వారికి స్నేహితులుండరన్న విషయం గమనించాలి. అలాగే నవ్వుతూ ఉన్నవారు ఏ పనైనా సునాయసంగా చేస్తారు. వారు తోందరగా అందరిలో కలిసిపోతారు. దాంతో ఆత్మస్థైర్య కూడా పెరుగుతుంది. కాబట్టి చిరునవ్వు అనే ఆభరణం తో మనం మన ముఖాన్ని అలంకరించుకోవాలి. అప్పుడు మనం అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాం కదా. మరెందుకాలస్యం. మరి చిరునవ్వుతూ మాట్లాడటానికి మీ కెలాంటి పెట్టుబడి అవసరం లేదు కదా.
Monday - December 23, 2024