ఆరు గ్యారంటీలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనంతా కర్ణాటకలో ఆగమాగంగా ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన మొదలు రాష్ట్రంలో నీరు లేదు, రోడ్లపై బస్సులు లేవు, రైతులకు భద్రత లేదు… ఇదీ పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు చూసిన ఏపీ పబ్లిక్ కూడా అదే గ్యారంటీల గారడీకి మొగ్ధులైపోయారు. తెలంగాణ, కర్ణాటక హామీలనే బాబు మళ్లీ రిపీట్ కాపీ చేసి సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టారు. అందులో భాగంగానే అమ్మకు వందనం పథకం పేరుతో ఇంటింటికి తిరిగి ఇవే సూపర్ సిక్స్ గురించి కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. బాబు, లోకేష్, పవన్ లు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మకు వందనం కింద ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అంతే ఇక తల్లికి వందనానికి మంగళమే పాడేశారు. జీవో 29 విడుల చేసి అందరికీ ఇస్తామన్న రూ.15 వేలు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి మాత్రమే రూ.15వేలు ఇస్తామంటున్నారు.. మరి ఇది మోసం కాదా…? కనీసం విడతల వారీగా ఇస్తామని కూడా చెప్పటం లేదు.
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ పాలన గురించి మాట్లాడితే ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి సంక్షేమమంటే ఏంటో చూపిస్తామన్నారు. మరోసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఎంటో తెలియజేస్తామనుకున్నారు. కానీ దేశం మొత్తం కరోనా వచ్చి రాష్ట్రాల్లో సుమారు మూడేళ్లు పాలనకు అంతరాయమే ఏర్పడింది. ఎలాంటి కరోనా లాంటి సమస్య లేనప్పునడు పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కు రెండు సార్లు అధికారాన్ని అప్పగించారు అక్కడి పబ్లిక్. జగన్ సంక్షేమం చేస్తూనే రెండేళ్ల పాలన కరోనాకు పరిమితమైపోయింది. దాంతో జగన్ కు మిగిలింది మూడేళ్లే… ఎందుకో ఏపీ పబ్లిక్ అసంతృప్తి చెందిపోయారు. సంక్షమం సరిపోదు అభివృద్ధే కావాలన్న ఏపీ పబ్లిక్ కోరికలకు దాని మూలాలు కూడా కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితిని చూసి కూడా కూటమి నేతల గ్యారంటీలను నమ్మి ఏపీ పబ్లిక్ మోసపోయింది. కనీసం ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా ప్రతిపక్షాన్నే నిర్వీర్యం చేసుకునేలా తీర్పు ఇచ్చుకున్నారు. చివరికి మంచి జరిగితేనే ఆలోచన చేయమన్న జగన్ మాటను పక్కన పెట్టి మరీ ముందడుగు వేసారు ఏపీ జనం. ఆంధ్రుల నిర్ణయం సరియైనదని మరి కొత్త ప్రభుత్వ పాలలనతోనే నిరూపించాలి మరి.
- పట్ట హరి ప్రసాద్…జర్నలిస్ట్. (ఇందులో అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)


