డిసెంబర్ నెల ప్రయాణాలు చేయడానికి అనుకూలమైనది. ఈ నెలలో సెలవులలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు మనాలిని సందర్శిస్తారు. హిమాలయాల ఒడిలో ఉన్న మనాలి ప్రకృతి అందాలకు నిలయం.. ఈ అందమైన నగరం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పర్యాటకులు ఢిల్లీ నుండి బస్సులో కూడా మనాలి చేరుకోవచ్చు. మీరు కూడా రాబోయే రోజుల్లో మనాలిని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మనాలి చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలు సందర్శించడానికి సరైనవి. తెలుసుకుందాం.
హిడింబా దేవి ఆలయం
హిడింబా దేవి ఆలయం మనాలిలో ఉంది. స్థానిక ప్రజలకు హిడింబా దేవి అమ్మవారు అంటే అమితమైన భక్తి. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయాన్ని 1553లో అప్పటి రాజా బహదూర్ సింగ్ నిర్మించారు. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఆలయ కళాకృతి కూడా విశిష్టంగా ఉంటుంది.. హిడింబా దేవి ఆలయ సౌందర్యం శీతాకాలంలో మంచు కురిసిన తర్వాత మరింత పెరుగుతుంది. హిడింబా దేవి ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం రోజూ, పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.
మాల్ రోడ్
మీకు షాపింగ్ అంటే ఇష్టం ఉంటే, మీరు మనాలిలోని మాల్ రోడ్ కు తప్పనిసరిగా వెళ్ళాలి.. ముఖ్యంగా చలికాలంలో మాల్ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ మార్కెట్ నుండి హిమాచల్ రాష్ట్రానికి చెందిన శాలువాలు మరియు జాకెట్లు కొనుగోలు చేయవచ్చు. మీరు స్థానిక తినుబండారాల రుచులను కూడా ఆస్వాదించవచ్చు. వింటర్ సీజన్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు మనాలిని సందర్శిస్తారు. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి మనాలిని తప్పక సందర్శించండి. అదే సమయంలో, మీరు మనాలిలో మాల్ రోడ్ షాపింగ్ కోసం వెళ్ళవచ్చు.
జోగిని జలపాతం
ఈ అందమైన జలపాతం మనాలిలోని వశిష్ఠ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, జోగిని జలపాతం నగరం నుండి 4 కి.మీ.ల దూరంలో ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి జోగిని జలపాతం చూడటానికి వెళ్ళవచ్చు. అయితే, జోగిని జలపాతాన్ని సందర్శించేటప్పుడు ఇచ్చిన మార్గాలను కూడ అనుసరించవచ్చు. అలాగే సెల్ఫీలు దిగుతూ జలపాతం దగ్గరకు వెళ్లవద్దు. హైకింగ్ చేసేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగాలి.