హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ ప్రజల గుండెచప్పుడై, రాష్ట్ర ప్రగతికి అక్షర సేద్యం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి. పత్రికలో పనిచేసే పనిమంతులను భుజంతట్టి ప్రోత్సహించే పలు కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. రిపోర్టర్ల వార్తలను, సబ్-ఎడిటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారి పొరపాట్లను సన్నితంగా ఎత్తిచూపటంతో పాటు.. పనిలో నిబద్ధత కనబరిచి పోటీతత్వంతో పనిచేసేవారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వార్తలకు మంచి శీర్షికలు పెట్టే సబ్-ఎడిటర్లను, విశ్లేషణాత్మక కథనాలను అందించే రిపోర్టర్లను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల వరుస కథనాలతో కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను రుజువులతో ప్రత్యేక కథనాలు అందించిన స్పెషల్ టాస్క్ బ్యూరో (ఎస్టీబీ) కరెస్పాండెంట్ కే. రాజశేఖర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించి, నగదు పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీబీ ఇంచార్జీ వెల్జాల చంద్రశేఖర్ కృషిని కూడా కొనియాడారు.
Monday - December 23, 2024