Monday - December 23, 2024

ప్రభుత్వ పొదుపు పథకాలు వద్దు… ప్రైవేట్ పెట్టుబడులే ముద్దు…

హైదరాబాద్: డబుల్ ఇంజిన్ పేరుతో బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఓ వైపు ప్రైవేట్ సంస్ధలు పెట్టుబడులు పెంచుకోవడానికి ఆకర్శణీయ పధకాలు ప్రకటిస్తున్నా.కేంద్ర ప్రభుత్వం మాత్రం సామాన్యుల పొదుపు పధకాల వడ్డీ రేట్లలో కోత విధిస్తూనే ఉంది. బ్యాంకులు అప్పులపై వడ్డీ రేట్లు పెంచుతున్నా…. డిపాజిట్ల వడ్డీ రేట్లు మాత్రం పెరగటం లేదు. గత నాలుగేళ్ళుగా బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి.

బెటీ పడాఓ..బేటీ బచాఓ లాంటి పధకాలు పెట్టి…ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వం..కనీసం ఆడపిల్లల సంరక్షణ కోసం పెట్టిన సుకన్య సమృధ్ధి యోజన పొదుపు పధకానికీ వడ్డీ రేట్లను పెంచలేదు… దరిమిలా రిటైర్డు ఉద్యోగులు, మధ్యతరగతి జీవులు
లిస్టెడ్ కంపినీల రిస్కులేని, స్ధిర ఆదాయం పొందే, బాండ్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లవైపు ఆకర్శితులౌతున్నారు.
గత అయిదు నెలల్లో బ్యాంకులు …వివధ రకాల ఋణాలకు గాను రెండు శాతం వడ్డీ పెంచితే…వివిధ రకాలైన డిపాజిట్లపై మాత్రం ఒక్క శాతం వరకు మాత్రమే పెంచింది. దీంతో చిన్న పొదుపు దారులు, సీనియర్ సిటిజన్లు చాలా నష్టపోయారు. అంతే కాదు ఆడపిల్లల భవిష్యత్తు సురక్షితం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృధ్ధి పొదుపు పధకం ఖాతా దారులకు మరింత నష్టం జరిగింది. పొదుపు వడ్డీ రేట్లలో కోత విధించడంతో ఖాతాదారులు పెదవి విరుస్తున్నారు. సుకన్య సమృధ్ధి యోజనకు 8.4శాతం వడ్డీ ఇచ్చేవారు. ప్రస్థుతం 7.6 శాతానికి కేంద్రం తగ్గంచింది. వడ్డీ తగ్గించటంతో దీర్ఘకాలిక పొదుపు పథకమైన ఈ పథకమం వైపు ప్రస్థుతం ఎవరూ మొగ్గు చూపడం లేదని ఓ పోస్టు మాస్టర్ చెప్పారు.

ఏడాది కాలానికి ఫిక్స్ డిపాజిట్/ టైమ్ డిపాజిట్ గాను 2020 లో 6.9 శాతం వడ్డీ ఉండగా ఇప్పుడది 5.5 శాతానికి తగ్గింది. అదే రెండేళ్ళ టైమ్ డిపాడిట్ కి 6.9 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గించింది. 3 ఏండ్లకు 6.9 శాతం నుంచి 5.8శాతానికి, 5 ఏండ్లకు 7.7 శాతం నుంచి 6.7 శాతానికి వడ్డీ తగ్గింది. రికరింగ్ డిపాజిట్ కి 7.2 శాతం వడ్డీ నుంచి 5.8 శాతానికి తగ్గింది.
సీనియర్ సిటిజన్లకు కూడా 5 ఏండ్లకు ఇచ్చే వడ్డీ 8.6 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గింది. 5ఏండ్ల నేషనల్ సేవింగ్ పధకానికి ల ఇచ్చే 7.9 శాతం వడ్డీ 6.8 శాతానికి తగ్గింది.
అలాగే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ కూడా 7.9 నుంతి 7.1శాతానికి కేంద్రం తగ్గించంది. కాని బ్యాంకులు మాత్రం తమ వివిధ రకాల ఋణాలకు వసూలు చేసే వడ్డీని దాదాపు 2 శాతం (1.90) పెంచాయి. దీంతో చిన్న, మధ్యతరగతి ఇన్వెస్టర్లు ప్రయివేటు కంపినీల బాండ్లు, ఎన్ వైపు ఆకర్శితులౌతున్నారు…..

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates