Monday - December 23, 2024

ఆట….ఆట….తప్పదు ఈ బతుకాట….

“యాద్గిరీ… బాగున్నావా? ఏంటి జోరుమీదున్నావు?” అని నేను పిలవడంతో  పాడుతున్న పాట ఆపి వెనక్కు తిరిగాడు. నన్ను చూసి… “నమస్తే ఇలేఖరన్నా! “నమస్తే! చాల్రోజులాయె.. కన్పిస్తలేవ్… బిజీయా? ఏది?” అన్నాడు.

“ఏం బిజీ యాద్గిరీ.. మా పరిస్థితి తెలుసు కద నీకు, ఎప్పుడూ ఎవరో ఒక నాయకుని చుట్టూ తిరుగుతూనే ఉంటాం కదా!” ఉద్యోగం చెయ్యాలి కదా! అందుకు వార్తలు కావాలి కదా!.. అన్నాను. నేను.

‘ఏందన్నా సంగతులు… రాజకీయాలు గరం… గరంగున్నట్లున్నయి. ఢిల్లీ సంగతులు ఏమన్న చెప్పనా…?” అన్నాడు.

 తిరిగి “అన్నా ఏం చాయ్ పానీ ఏం లేదా?” అన్నాడు. “చాయేముంది తోగొచ్చు. నదు బాయ్ తాగుదాం” అంటూ చిన్న చాయ్ బండి దగ్గరకు నడిచాను.

స్టూల్ దగ్గరకు లాక్కొని కూర్చుంటూ “అన్నా కొత్త సంగతులేమన్నా ఉన్నాయా?” అన్నాడు……

“నీకు తెలియనివి ఏమున్నాయి … నువ్వే చెప్పు… ప్రజలేమనుకొంటున్నారు? రాజకీయాల గురించి….” అన్నాను. “ఏముందన్నా… మల్ల ఎలచ్చన్లోచ్చేట్లున్నయి గదా… మొన్న సెంద్రబాబు కూడా గదేందో మూడో

ఫ్రంటు పెట్టిండట కదా” అన్నాడు.

“ఔన్లు! యునైటెడ్ నేషనల్ ప్రోగ్రెసివ్ అలయెన్స్… యు.ఎన్.పి.ఎ. అని పేరు పెట్టారు అన్నాను. “”అదేందన్నా పేరు కూడా కాంగ్రెసోళ్ళ ఫ్రంటు లాగనే ఉన్నది. సేమ్ టు సేమ్ పేరు పెట్టిండ్రు”

అన్నాడు. “నాకేం అర్ధం కాక సేమ్.. టు.. సేమ్.. ఏమిటి?” అన్నాను..

“గడే అన్నా కాంగ్రెసోల్లేమో… “నేషనల్ ప్రోగ్రెసివ్ అలయెన్స్, ఎన్.పి.ఎ. అని… బీజీపోల్లేమో “నేషనల్ డెమోక్రెటిక్ అలయెన్స్” అని కదా పేరు పెట్టినారు. ఈళ్ల పేర్ల “యునైటెడ్” తీసేస్తే ఏమైతది. -అదే పేరొస్తది. పేరేమో కాంగ్రెసోళ్ళ లాగుంటే… పనేమో విజేపోళ్ళలాగా చేస్తున్నరా? ఏంది? ఎట్లయిన అపోజిషన్లున్నరు గదా…” అన్నాడు.

మళ్లీ యాద్గిరే “ఏమో అన్నా! చెప్పలేం ఎప్పుడైన ఆళ్ళతో దోస్తానా చెయ్యాల్సి వస్తదని అటూ.. ఇటు గాకుండ పేరు పెట్టిండ్రేమో… ఎట్లయిన సెంద్రబాబు తెలివే తెలివి గద…” అన్నాడు . “ఎందుకలా అంటున్నావు.. పేరులో కూడా తప్పుపడ్తున్నావా?” అన్నాను నేను.

“తప్పా…?” నేనేం తప్పు పడ్తలేనన్నా? సెంద్రబాబు తెలివి గురించి చెబుతున్నా… నీకు డెలవదా.

కానికి మామనే గద్దె దించి… పెజాస్వామ్యమని నమ్మించిండు… అన్నాడు” . “అవన్నీ పాతవైపోయినైగాని, కొత్తవేమన్నా చెప్పు” అన్నాను.

“కాదన్నా… మా ఊళ్లి దాన్ని థర్డ్ ఫ్రంట్ కాదు… ఓడిపోయిన ముఖ్యమంత్రుల క్లబ్ అని చెబుతున్నారన్నా… క్లబ్… అంటే… టైం పాస్కు పోతరు కదా… అక్కడ పత్తాలాట, క్యారంబోర్డు, అన్ని అడ్డరట కద… గట్లనే ఈళ్ళు ఓ క్లబ్ పెట్టిన్రు… ఆటల ఓడతమని తెలిసి కొందరు పత్తాలాట ఆడి డబ్బులు గొరిగిచ్చుకుటరన్నా… గట్లనే మొన్న రాష్ట్రపతి ఎలచ్చన్లల్ల ఓడతడని తెలిసి… బీజేపోళ్ళు . కేండేట్ను నిలబెట్టిన్లు అన్నాడు…” యాద్గిరి.

తల దిమ్మెక్కి.. మరింత శ్రద్ధగా వినడానికి ముందుకు జరిగాను. నా ఇంట్రెస్టు చూసి రెట్టించిన ఉత్సాహంతో  చెప్తున్నాడు. “అన్నా… మా వూర్లల్ల ముండబొడ్లు (అంటే భర్త చనిపోయినోల్లు) చమించాలన్నా… విధవరాండ్లు..

మా తెలంగాణాల గట్లనే అంటరు… కొంచెం రఫ్ గుంటది. ఏమనుకోకున్నా…” అన్నాడు. “ఏమనుకోనులే… నీ సంగతి తెల్వదా… ఆ తర్వాత చెప్పు…” అన్నాను.

“భర్త పోయినోల్లందరూ… కొన్ని రోజులు ఎటూ బయటికెల్లరు… ఇక ఒక కాడ చేరి ఒకటే ముచ్చట్లాడుకుంటారు… ఒకళ్ళ బాధలొకరు చెప్పుకుంటారు. అట్లనే మన ఓడిన ముఖ్యమంత్రులందరూ…. ముచ్చట్లాడుకునే దానికి థర్డ్ ఫ్రంట్ అనే క్లబ్ పెట్టిను”. అన్నాడు. మళ్లీ అతడే “వాళ్ళేం మాట్లాడుకున్నారో.. తెలుసా?” అన్నాడు.

“అదేం కాదులే అంటూనే… ఆసక్తిగా వాళ్ళేం మాట్లాడుకున్నారంటావ్ నువ్వు?” అన్నాను. “అన్నా… ఒకాయనేమో… “నేను ఎట్ల ఓడిపోయిననో నా కింతవరకు తెలుస్తలేదంటడు, ఓడే ఛాన్సే లేకుంటే, కింది దాకా జబర్దస్త్ ప్లాన్ చేసిన… సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన… కాని ప్స్… లాభం లేకుండ పాయె…”

ఇంకొకాయన… “ఓడితే ఓడిన… ఈ సారి పక్కా నా గవర్నమెంట్ ఫాం అవుతది… నో డౌట్…. గవర్నమెంట్ అంతా పిచ్చి తుగ్లక్ పన్లు చేస్తున్నది”.

మరొకాయన… “యాంటీ ఇంకెంబెన్సీ ఉంటది. ఈ సారి మళ్ళ మా గవర్నమెంటస్తదన్న…. “దున్నేస్తా… ఎందుకంటే… ఈ మధ్య ప్రజలూ తెలివిమీరి పోయారు. ఏ గవర్నమెంటుకు రెండోసారి. ఛాన్సు ఇవ్వటం లేదు… అందుకే ఈ సారి నా ఛాన్సు పక్కా..”.

నాల్గో మాజీ… ఇవన్నీ గాలి మాటలాపి… భవిష్యత్తులో ఏం చేయాలో మాట్లాడండి…. మరో మాజీ… ఏదో ఒక సమస్యను తీసుకొని ప్రజల్లోకి వెళ్లామా? ర్యాశీలూ… ఆందోళనలూ చేద్దామా?…..

ఒక మాజీ… ఎలక్షన్లు ఇంకా… చాల్రోజులున్నాయి ఖర్చు తడిసి మోపెడవుతుంది… ఇంతలో ఒక ‘రాజ’భక్తిపరాయినుడు తలదూరుస్తూ….

మేము ఇక్కడ పెద్ద పెద్ద ఆందోళనలు చేస్తున్నాము. ఈ మధ్య ఢిల్లీలు ర్యాలీలు తీసాం… ప్రత్యేక రైలు పెట్టి కార్యకర్తలకు ఢిల్లీ తీసుకెళ్లాం… కోటి రూపాయలకుపై ఖర్చయింది అది వేరే విషయమనుకోండి…

మరో మాజీ… అవునండి ఖర్చవుద్దండీ… అప్పుడు సంపాయించ లేదా… మళ్ళీ గవర్నమెంటొస్తే సంపాయించరా?

ఎహ్ ఆపండి… గోల… చిరాకుతో అన్నాడంట ఒక మాజీ…

చాల్లే … నీవు మంచి రైటరైతే… సోషియో ఫాంటసీ కథ రాయి… ఎవరో ఒకరు సినిమా

తీస్తే డబ్బులే డబ్బులు… ఈ బాధలు తప్పుతాయి కదా… అన్నాను”.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates