నీ పలకరింపు…
నాకు వేయి ఏనుగుల
బలాన్నిస్తుందని…
నిరాశ నిస్పృహలతో…
కాలమీడిస్తున్న నాకు,
మరో జన్మ పై ఆశ కలిగిస్తోందని,
నీకు తెలిసినా….
రెండక్షరాల hi, hallo
చెప్పకుండా…
కష్టాల కడలి
దాటడమెలానో
నేర్పిస్తున్నావా?
నన్ను నట్టేట ముంచి
అర్ధాంతరంగా వెళ్లిపోయినా….
ఆమె గుర్తులే ఆలంబనగా.
జీవిస్తున్న నేను,
నీ పరీక్ష గట్టెక్కనా?,
కవచ కుండలాలడిగిన
కపట బ్రాహ్మణుడెవరో తెలిసీ,
దానమిచ్చిన
కర్ణుడి కథే
నాకు స్ఫూర్తి కాదా?
…రచన:ఎం.ఎం.ఎస్.కుమార్