అర్థం చేసుకుంటే నీ
కోపం లో అర్ధం వుంది నేస్తమా…
అపార్ధం చేసుకుంటే నా ఆవేదనకు అర్థమే ఉండదు మిత్రమా,
అందుకే ….
నాదే తప్పని ఒప్పుకున్నా, నన్నర్ధం చేసుకున్న
నేస్తం దొరికాడని
గర్వ పడుతున్నా..
నిన్నర్ధం చేసుకున్నా,
ఈ ప్రాణముండగా కష్ట పెట్టే పని చెయ్యనన్నా,
అందుకే నువ్వు పలకరించే వరకు ఎదురు చూస్తా,
నువ్వు పలకరిస్తే పలవరించి పోతా,
కన్నెర్రచేస్తే కన్నీరు కారుస్తా,
నువ్వు నా స్నేహాన్ని కాదన్న రోజున..
శిలలా ఊరకుండిపోతా,
కొవ్వొత్తిలా కరిగి పోతా,
శలభం లా మారిపోతా,
మౌనంగానే రోదిస్తా..
మనసున్న మనిషిగా
మరో జన్మ కైనా
నీ కోసం ప్రార్ధిస్తా…..
నేస్తమా నీ స్నేహం, వరమైనా, శాపమైనా,
మహా ప్రసాదంగా స్వీకరిస్తా.. ఈ జన్మకు
దైవాజ్ఞగా భావిస్తా..
నా ఆయుష్షు కూడా నీ కిచ్చేస్తా,
నువ్వూ, నీ కుటుంబం కల కాలం…
నవ్వుతూ ఉండాలని దీవిస్తా,
తనువులు చాలిస్తే కనీసం….
సమాధులనైనా ప్రక్క ప్రక్కనే కోరుకుంటా..
రచన:-ఎం.ఎన్.ఎస్.కుమార్….