Monday - December 23, 2024

మాటలే మంత్రాలు…

సక్సెస్ కు మరో సూత్రం మాటలే అన్నది తెలుపోవాలి… ఇక్కడ మాట కంటే ముందుగా మంత్రం గురించి మాట్లాడుకుందాం. హిందూసాంప్రదాయంలో బ్రాహ్మణులు ఏ హోమం చేసినా.. పూజ చేసినా.. ఆఖరుకు పెళ్ళి చేసినా… మంత్రాలు చదువుతుంటారు. వాటి అర్థం తెలియక పోయినా వింటానికి చాలా బాగుంటాయి. నిజానికి మన హిందువుల ఇండ్లలో మనం ఉదయాన్నే వేంకటేశ్వర సుప్రభాతం వింటుంటాం. ‘కమలాకుచ చూచుకు… అంటూ… కాని దానర్ధం ఎంతమందికి తెలసు. ‘చాలా మందికి అర్థం తెలియదు’ అని నేనంటే
ఎవరైన ఖండిస్తారా?… ఖండించలేరు… ఎందుకంటే అది నిజం. కాని మరి ‘ఎందుకు వింటారు?’ ఏదో దేవుడు శ్లోకాలని అని జవాబిస్తారని అనుకోండి. కాని అంతకంటే మరో నిజం ఏమిటంటే వాటిని వింటుంటే మన ‘మనసు పులకరిస్తుంది. ఎంతో హాయిగా అనిపిస్తుంది.
దానికి కారణం ‘సంగీతం’. ‘సంగీతం’.. వినడానికి ఇంపుగా ఉంటుంది. వింటే మనసుకు ప్రశాంతతనిస్తుంది. హాయినిస్తుంది..సంతోషాన్నిస్తుంది. అందుకే సంగీతానికి రాళ్ళే కరుగుతాయంటారు.
అలాంటప్పుడు, మనుషులెంత. అందుకే మన పెద్దలు ‘నోరు మంచిదైతే ఊరు మంచిదన్న’ సామెతను మనకిచ్చారు. ఈ సూత్రం ప్రకారం అందుకే మన మాట కూడా సంగీతంలా మృధువుగా.. సున్నితంగా… ఉండాలి. మనసుకు శాంతం చేకూర్చేలా ఉండాలి. అప్పుడు ఎవరైనా మీ మాటలు వింటారు. అందుకే మీరు మీ మాటను మార్చుకోవాలి. మాటల్లో మృధుత్వం ఉండాలి. చిన్నగా, కఠినమైన పదాలు కాకుండా, మంచిగా మాట్లాడాలి.. దానికి చిరునవ్వును జోడించాలి. అప్పుడు విజయంలో తొలిమెట్టు ఎక్కినట్లే. ఎవరికైనా ఏ పనైనా… చెప్పేటప్పుడో… సహాయం అడిగేటప్పుడో… కొంచెం మృధువుగా… రిక్వెస్ట్ చేసే ధోరణిలోనే అడిగారనుకుండి.. మీ పని సగం అయినట్లే.. మిగతా సగం అవతలి వారు పూర్తిచేస్తారు. ఒక
అధికారి తన కింది ఉద్యోగికి పని చెప్పినా.. ఓ గంటలో పూర్తి చెయ్యాలి.
లేక పోతేనీ ఉద్యోగం తీసేస్తా… అని అనే బదులు. ఈ పని గంటలో పూర్తి చేయకపోతే నీ ఉద్యోగమే కాదు నాదీ పోతుంది. అని చెప్పారనుకోండి…. కింది ఉద్యోగికి ఎలాంటి కోపం రాదు. కాని ‘గంటలో పూర్తి చేయకపోతే నీ ఉద్యోగం తీసేస్తా’ అని అంటే, తప్పకుండా మనసులో నైనా తిట్టుకుంటాడు. అలాగే ఎవరినైనా సహాయం కోరెటప్పుడు కొంచెం సున్నితంగా, మృధువుగా కోరారనుersడి. తప్పనిసరిగా పని చేసిపెడతారు. కనీసం ఆ పని చేయడాని శతవిధాల ప్రయత్నిస్తారు. ఈ మార్పును మీరు గ్రాహించాలి. మన మాటల వల్లే మనకు ఎంతో మంది మిత్రులు, శత్రువులుగా తయారవుతానరన్న విషయం తెలుసుకోవాలి. మనం ఎవరితో ఏం మాట్లాడాలి?.. ఎలా మాట్లాడాలి?… అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంట్లో.. ఫ్రెండ్స్ తో.., ఆఫీసులో.. క్రింది స్థాయి ఉద్యోగులతో ఒకే విధంగా మాట్లాడకూడదు. క్రింది ఉ ద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆప్యాయంగా ఉండాలి. వారి సమస్యలనూ అప్పుడప్పుడూ వింటూ ఉండాలి. అవసరమైన సహాయం చేయాలి. అప్పుడు మీరు చెప్పిన పని సకాలంలో చేస్తారు. ఆఫీసు సమయం అయిపోయినా, ఆ రోజు సెలవయినా, ఆర్థ రాత్రయినా, అపరాత్రయినా, ఎప్పుడైనా, మీరు పిలవగానే వచ్చి మీకు అండగా నిలుస్తారు. అంటే మీరు చేసే పనికి ఇంకొకరు తోడయ్యారంటే మీ పని సులువైనట్లే కదా.. అంటే మీ మాటలే వారి పై మంత్రాల్లా పనిచేస్తాయి. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేవేమో కాని మీ మాటలు మంత్రాల్లా ఉ ంటే మాత్రం ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపస్తాయి. అంటే మీ మాటలు వారిపై మంత్రాల్లా పనిచేస్తాయి. ఇప్పటికైనా మనమందరం మన మాటల్లో కరుకుదనాన్ని తగ్గించి మృధువుగా, ప్రేమగా మాట్లాడం నేర్చుకుందాం. ముఖ్యంగా విద్యార్థులందరూ ఇప్పటికైనా తమ మాటలను మంత్రాల్లా శ్రావ్యంగా, ప్రేమగా, మృధువుగా మార్చుకుంటే ఉన్నత స్థానం మీకెంతో దూరంలో ఉండదని చెపితే నమ్ముతారా? లేదా?

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates