-కేంద్రం కిరాయికివ్వాలంటే… చౌక ధరకు ఇద్దామంటున్నఆప్
-ఢల్లీిలో 45 వేల ఇండ్ల కేటాయింపులో తకరారు..
హైదరాబాద్: పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు పెద్ద ఎత్తున ఇండ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకునే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, వాస్తవానికి ఢల్లీిలో మోకాలడ్డుతోంది. ఇది అక్షరాల నిజం. దేశ రాజధాని ఢల్లీి లో ఉన్న ఆవ్ు ఆద్మీ పార్టీ ప్రభుత్వమేమో పేదలకు చౌకధరకు ఇండ్లు కేటాయిద్దామంటుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకుండా ఫైలును తొక్కిపడుతోంది. దాదాపు రెండేళ్ళ నుంచి ఢల్లీిలో పేదల కోసం కట్టించిన 45 వేల ఇండ్లు(ఫ్లాట్లు), ఇలా పేదలకు అందని ద్రాక్షలాగే మిగిలాయి. రెండు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండ్ల నిర్మాణం పూర్తయినా, పేదలు లబ్ది పొందలేక పోతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పధకం కింద ఢల్లీిలో 45 వేల ఫ్లాట్లు నిర్మించారు. ఇందులో కేంద్రానిది సగం ఖర్చు కాగా, ఢల్లీి సర్కారు సగం ఖర్చు భరించింది.
ఢల్లీి లో కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఏర్పడగానే మురికి వాడల్లో నివసించే వారికి ఇండ్లు కేటాయించే పధకాన్ని ప్రవేశపెట్టింది. లక్షా ముప్పై రెండు వేల రూపాయల ధరకు (మిగతాది ఢల్లీి ప్రభుత్వం సబ్సీడీగా) ఇప్పటికే రెండువేల మందికి పైగా ఇండ్ల కేటాయించింది. ఢల్లీి పట్టిణ ఆవాస అభివృధ్ధి బోర్డు (ఢల్లీి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు -డీయూఎస్ఐబీ) నోడల్ ఏజెన్సీ గా పనిచేస్తుంది. ఆ పథకం కోసం ఈ సంస్ధ ఇప్పటీకే పేద లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి 9,535 లబ్ది దారుల నుంచి టోకెన్ అడ్వాన్సు కూడా తీసుకుంది.
కేటాయింపులను నిలిపివేయాలని 2020 లోనే ఆదేశించిన కేంద్రం…….
కరోన కాలంలో 2020 లో కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రాంతంనుండి వలస వచ్చే వారికోసం ఢల్లీిలో సరసమైన ధరకు కిరాయి ఇండ్ల పథకం (అఫర్టబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ -ఏఆర్ఎచ్సీ) ప్రవేశ పెట్టింది. అయితే . జెఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇప్పిటికే నిర్మించిన ఫ్లాట్ల కేటాయింపును కేంద్రం నిలిపివేయాలంటూ ఢల్లీి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ 45 వేల ఫ్లాట్లను ఏఆర్ఎస్సీ పథకాని కేటాయించాలని కేంద్రం అంటుండగా, ఢల్లీి ఆప్ సర్కారు మాత్రం ససేమిరా అంటున్నది. 18,639 ఫ్లాట్లను మురికివాడల్లో నివసించే వారికి కేటాయించాల్సి ఉందని ఆప్ సర్కారు పట్టు పడుతోంది. వీరిద్దరి వివాదం ఇలా ఉంటే అందులోని 9104 ఫ్లాట్లు తమకు కేటాయించాలని ఢల్లీి డెవలప్మెంట్ అథారిటీ కోరుతోంది.
పేదలకు కిరాయికి ఇచ్చే ఏఆర్ఎచ్సీ పథకానికి ఆ ఇండ్లు కావాలని అధికారులు పట్టుబడుతూ, ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని అంటున్నారు. ఢల్లీి సర్కారు కూడా తానేమీ తక్కువ తినలేదని, తమకు కావాల్సిన ఇండ్లు ఇచ్చే దాకా తామూ తగ్గబోమని పట్టుబడుతోంది. ఈ వివాదం గత రెండేళుగా తేలక పోవడంతో అధికారులు తల పట్టుకున్నారు. కొసమెరపేమిటంటే రాజీవ్ రత్న ఆవాస్ యోజన పథకం కింద పేదలకోసం నిర్మించిన మరో 26000 ల ఫ్లాట్లూ కేటాయింపులకు నోచుకోకుండా పేదలకు అందని ద్రాక్షలాగే మిగిలాయి.