ఉన్నట్టుండి మీ జ్ఞాపకం నన్ను కలవర పెడుతుంది
మీ తలపు నా మదిని నలిపేస్తుంది,
కాసేపు తల వాల్చుదామని
కళ్ళు మూసుకున్నా..
నీ రూపే కనిపిస్తుంది,
చెవుల్లో నీ నవ్వే వినిపిస్తుంది,
ను్వ్వు నాకందనంత దూరాన ఉన్నావన్న నిజం..
గుర్తు కొచ్చిన క్షణాన…
నీరసించి పోతాను,
చలనం లేని శిలాగా మారిపోతాను..
ఎం చేయను?
నా నిస్సహాయతను, విధి రాతను ..
చూసి… నవ్వుకోవడం తప్ప….
రచన..ఎం.ఎన్.ఎస్.కుమార్