Monday - December 23, 2024

రైల్వే యాత్రీకుల డాటా అమ్మకానికి?!

హైదరాబాద్, డిసెంబర్ 29: మీరు ఎప్పుడో ఒకప్పుడు రైలు ప్రయాణానికి టికెట్టు రిజర్వేషన్ చేయించుకున్నారా? అవునంటే… మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఊరు,ఫోను నంబర్.. తదితర వ్యక్తిగత సమాచారం ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. ఇది నిజం… అవసరమైన వ్యాపారవేత్తలు ఆ డాటాను కొనుక్కోవచ్చు. మీ వివరాలు ఎవరిక్కావాలి? అని తేలిగ్గా కొట్టిపారేయకండి. మీకు ఫోనుంటే..మీకే తెలుస్తుంది.ఈ రోజుల్లో ఫోను లేనిదెవరికి? ఇటీవల రోజుకి కనీసం ఓ 10 ఫోైన్లెనా వస్తున్నాయి కదా. మీకు ప్లాటు కావాలా? లోను కావాలా? ఇన్సూరెన్సు చేయించుకుంటారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంటారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటే మరింత చికాకు పడతారు కదా… ఇదంతా సహజమైంది ఈ రోజుల్లో .. మీ నెంబరు వారికెలా తెలిసిందనుకుంటున్నారా?…అదే డేటా దొంగతనం..
భారతీయ రైల్వే యాత్రీకులకు సంబంధించిన 3 కోట్ల వినియోగదారుల సమాచారం(డాటా), డార్క్ వెబ్ అమ్మకానికి పెట్టారని హాకర్ల ఫోరమ్ ద్వారా వార్తలు వెలువడటంతో కేంద్ర ప్రభుత్వానికి తలవంచుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. ఒక వైపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ ముసాయిదా బిల్ తీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టి, బిల్లు పాస్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, మరో వైపు భారతీయ రైల్వే యాత్రికుల డేటా ప్రపంచ వివణిలో అమ్మకానికి ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్వయంగా తమ సిస్టమ్ లేదా తమ ఇండియన్ రైల్వే క్యటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్ (ఐఆర్ తదితర అనుబంధ సంస్ధల నుంచి ఎలాంటి డాటా దొంగిలించ బడలేదని స్పష్టం చేసింది. అయితే ఐఆర్ తన వ్యాపార భాగస్వాములందరనీ వారి నుండి ఏదానా డాటా లీక్ అయిందా ? అన్న విషయాన్ని పరిశీలించి, రూఢీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ మరో వైపు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దాంతో నమూనా డాటా విశ్లేషణలో.. ఐఆర్ హిస్టరీ అప్లకేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ తో సరిచూసుకుంటే సరిపోవటం లేదని కూడా తేలింది. దొంగిలించబడిందని అనుకుంటున్న డేటా, ఐఆర్ సర్వర్ నుండి కాదంటూ రైల్వేమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates