Monday - December 23, 2024

బతికుంటే,బాగుంటే…బండలైన కొట్టొచ్చు….

ఓ…ఓ…ఓ…ఓ…వారీ…ఓ..ఓ..వారీ….
కరోనా…కరోనా….కరోనా…
కొరోనా భయం బట్టి
లోకమంత పాణమెట్ల నిలుపాలని
పరుషాను అయితంటే
నువ్వేమో నాకేమయితదని నీలుగుతున్నవేందిరా…
ఓ…ఓ…… వారీ….ఓ…ఓ….వారీ….
చేయి చేయి కలపకు, షేకు హాండు ఇవ్వకు…
బయటకేమో ఎల్లకు, బాగుంటే… బతికుంటే,
బండలైన కొట్టొచ్చు….కొంపలేమి మునిగినయి…బయిటికెందుకు పోతున్నవ్…
ఓ…ఓ……వారీ…ఓ..ఓ..వారీ….
చేతులెత్తు లెత్తి మొక్కుతం, కాళ్లు కూడా మొక్కుతం..
చెప్పినట్టు ఇనురా, రోడ్ పైకి రాకురా….గత్తరచ్చి పోతవురా…
సిఎం., పిఎం., అందరూ సెప్తుంటే ….ఇంకెవరు చెప్పాలె….
సిగ్గనిపిస్తలేదా….
కరోనా వైరస్ సోకితే….నీకు నువ్వు కాదురా..
పెళ్ళాం పిల్లలను కూడ సంపుతవ్…
అయ్యా, అవ్వ తో పాటు నిన్ను తాకినోళ్ళందరిని సంపుతవ్
మొత్తుకుని సెపుతున్నా సమ్ జైతలేదురా……
ఓ…ఓ…వారీ…ఓ..ఓ..వారీ…………… కోరస్…. చేయి చేయి కలపకు, షేకు హాండు ఇవ్వకు… బయటకేమో ఎల్లకు

కెసీఆర్ చెప్పిండు, కెటీఆర్ చెప్పిండు….
ప్రధాన మంత్రి చెప్పిండు,….అయిన కూడా
సడక్ మీద కన్పిస్తున్నవ్…సైకిల్ మోటర్ దీస్తున్నవ్…
పోలీసుళ్ళు ఆపినా, గత్తరస్తే పిట్టల్లా సత్తమని..
గదవ బట్టి చెప్పినా ఇనకుంటే…కట్టె బట్టి జోప్పుతుండ్రు…
ఓ…ఓ…ఓ…ఓ…వారీ…ఓ..ఓ..వారీ…. …….. కోరస్…. చేయి చేయి కలపకు, షేకు హాండు ఇవ్వకు… బయటకేమో ఎల్లకు
. ఇంటికాడ..గమ్మున కూసోరా..మల్ల చెప్పెదాక గుమ్మం ఇడిసి రాకురా…
…రాశను..గ్రాసమూ…ఎట్లైన ఇస్తమని..
పేపర్ల, టీవీల సర్కారోళ్ళు చెబుతున్నా… పరేషాను ఎందుకురా..
అంబలి తాగైన పాణం కాపాడుకోరా….
నీకోసం…నాకోసం…మనకోసం….మల్లొకసారి సెబుతున్న…
మందు లేదు…మాకు లేదు…గత్తరస్తే…మనమే కాదు…పిఎం..సిఎం..అందరూ ఒకటేరా…
నువ్వు సచ్చుండేందో కాని అందర్నీ సంపుతవా….
ఓ…ఓ…ఓ…ఓ…వారీ…ఓ..ఓ..వారీ…. …. …కోరస్…. చేయి చేయి కలపకు, షేకు హాండు ఇవ్వకు… బయటకేమో ఎల్లకు
యుద్దమంటే ఇదేరా…ఇకముందు
కత్తులుండవ్, కటార్లుండవ్,
తోపు లుండవ్…తుపాకులుండవ్,
బాంబులుండవ్, బరిశలుండవు…
బయో వారంటే గింతేరా….
కొరోనాకు మందే కనిపెట్టలేదింక…
ఇరాన్, ఇటలీ, బ్రిటన్, చైనా, .
ఒకటేంది..రెండేంది, అగ్రరాజ్యం అమెరికా తోపాటు
200లకెక్కువ దేశాల్లో గత్తర లేసిందరో….
ఓ…ఓ…ఓ…ఓ…వారీ…ఓ..ఓ..వారీ…. …
కోరస్…. చేయి చేయి కలపకు, షేకు హాండు ఇవ్వకు… బయటకేమో ఎల్లకు
బాగుంటే… బతికుంటే,
బండలైన కొట్టొచ్చు….కొంపలేమి మునిగినయి…బయిటికెందుకు వెల్తున్నవ్…
చెప్పినట్టు ఇనురా…చేతిలెత్తి మొక్కుతం..లేకుంటే గత్తరచ్చి పోతంరా…
ఓఓఓఓఓఓఓఓఓ……..
…………..రచనః-ఎం.నాగశేష కుమార్…..

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates